Yamaha Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
Yamaha Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
సూపర్ క్లారిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ BASS అందించే యమహా సౌండ్ బార్
ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది
Yamaha Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. సూపర్ క్లారిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ BASS అందించే యమహా సౌండ్ బార్ ను ఈరోజు మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. మీడియం బడ్జెట్ రేంజ్ లో పవర్ ఫుల్ సౌండ్ బార్ ఆఫర్స్ కోసం చూస్తున్న యూజర్లు ఈ సౌండ్ బార్ ఆఫర్ పై ఒక లుక్కేయవచ్చు.
Yamaha Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్
యమహా యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ SR-B40A ప్రస్తుతం కంపెనీ అధికారిక సైట్ నుంచి రూ. 37,493 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ ఇండియా ఈ సౌండ్ బార్ ను రూ. 13,952 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 23,541 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ యమహా సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి HSBC, Yes Bank మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 22,041 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: itel A90: అతి చవక ధరలో స్టన్నింగ్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!
Yamaha Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ యమహా సౌండ్ బార్ లో ప్రీమియం లుక్స్ కలిగి ఉంటుంది మరియు 55 ఇంచ్ నుంచి 65 ఇంచ్ స్మార్ట్ టీవీ లకు బాగా సరిపోతుంది. అంటే, బార్ పొడవును బట్టి ఇది పెద్ద టీవీ లకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ యమహా సౌండ్ బార్ నాలుగు 1.8 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు 1 ఇంచ్ డూమ్ ట్వీటర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో జబర్దస్త్ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో బార్ 200W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది మరియు సబ్ ఉఫర్ 100W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ యమహా సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది యమహా ట్రూ సౌండ్, వర్చువల్ సౌండ్ మరియు స్పటియల్ ఆడియో తో రూమ్ లో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ యమహా సౌండ్ బార్ స్టీరియో, స్టాండర్డ్, మూవీ మరియు గేమ్ నాలుగు మోడ్స్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, HDMI eARC/ARC, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.