LG 55 Nano Smart Tv పై సేల్ కంటే ముందే బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు LG 55 Nano Smart Tv పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 కంటే ముందే ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది

LG 55 Nano Smart Tv పై సేల్ కంటే ముందే బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 కంటే ముందే ఫ్లిప్ కార్ట్ ఈరోజు LG 55 Nano Smart Tv పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, సేల్ కంటే ముందే చాలా స్మార్ట్ టీవీలతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా సేల్ కంటే ముందే ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ ఆఫర్ చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మరింత ఆకట్టుకునే ఆఫర్ ధరలో లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG 55 Nano Smart Tv : ఆఫర్

ఎల్ జి నానో టీవీ సిరీస్ 2026 నుంచి సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 55 NU 870 BPLA మోడల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ 47% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 45,990 ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీ పై రూ. 6,337 రూపాయల భారీ ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 39,653 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ టీవీ లంచ్ తర్వాత ఈ ఆఫర్ తో ఈరోజు ఈ అతి తక్కువ ప్రైస్ లో లభిస్తోంది.

LG 55-Inch Nano Smart TV: ఫీచర్లు

LG నుంచి వచ్చిన ఈ 55 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ ఆధునిక డిస్‌ప్లే టెక్నాలజీ మరియు AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇది మెరుగైన ఆడియో అనుభూతి మరియు విభిన్న కనెక్టివిటీ ఆప్షన్లతో ఆకట్టుకునేలా రూపొందించబడింది. 55NU870BPLA మోడల్‌ గా పేర్కొన్న ఈ టీవీ 2026 వేరియంట్ మరియు α7 AI Processor 4K Gen 9 ప్రాసెసర్ పనిచేస్తుంది.

LG 55 Nano Smart Tv Offer

ఈ టీవీలో 55 ఇంచ్ నానో డిస్‌ప్లే ని 4K UHD (3840 × 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అలాగే, 60Hz రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది కాబట్టి సినిమాలు, టీవీ షోలు, స్పోర్ట్స్ మరియు ఇతర కంటెంట్‌ను స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ టీవిలో విజువల్ క్వాలిటీని మరింత మెరుగుపరచేందుకు డైనమిక్ టోన్ మ్యాపింగ్, AI HDR రీ మాస్టరింగ్, HDR10, HLG, మరియు 4K Sసూపర్ అప్ స్కేలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!

ఆడియో విషయానికి వస్తే, ఈ టీవీలో రెండు 10W స్పీకర్ ఉన్నాయి. అంటే, ఇది మొత్తం 20W సౌండ్ అవుట్‌ పుట్ అందిస్తుంది. ఇందులో మెరుగైన ఆడియో అనుభూతి కోసం AI Sound Pro మరియు Virtual 9.1.2 Up-mix వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, Dolby Atmos సపోర్ట్ కూడా ఉండటంతో, కంటెంట్‌ ను వీక్షించేటప్పుడు మరింత ఇమర్సివ్ ఆడియో అనుభూతిని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile