Tecno Pova Curve 2 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన టెక్నో బిగ్ బ్యాటరీ ఫోన్ సేల్.!
టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది
Tecno Pova Curve 2 5G బిగ్ బ్యాటరీ మరియు సరికొత్త డిజైన్ తో లాంచ్ అయ్యింది
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి
Tecno Pova Curve 2 5G: టెక్నో లేటెస్ట్ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇండియాలో 8000 mAh బిగ్ బ్యాటరీ మరియు సరికొత్త డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyTecno Pova Curve 2 5G: ప్రైస్
టెక్నో పోవా కర్వ్ 2 రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ (8 జీబీ + 128 జీబీ) స్టార్టింగ్ వేరియంట్ ను రూ. 27,999 ధరతో మరియు (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 29,999 ధరతో లాంచ్ చేసింది. మిస్టిక్ పర్పల్, స్టోర్మ్ టైటానియం మరియు మెల్టింగ్ సిల్వర్ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆఫర్స్
టెక్నో పోవా కర్వ్ 2 ఫోన్ పై రూ. 1,500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు 3 మరియు 6 నెలల No Cost EMI ఆఫర్ తో రూ. 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: SKOAR! College Cup Delhi Edition వాలరెంట్ గ్రాండ్ ఫినాలే: ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు
Tecno Pova Curve 2 5G : ఫీచర్లు
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా Glass 7i ప్రొటెక్షన్ తో చాలా పటిష్టంగా ఉంటుంది. కేవలం 7.42 mm మందంతో ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ Dimensity 7100 5G ప్రోసెసర్ జతగా 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ ను టెక్నో అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 8 జీబీ అదనపు ర్యామ్ కూడా ఉంది.
50 MP ప్రధాన కెమెరా జతగా 2 MP సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంది. అలాగే, ముందు 13MP సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ముఖ్యంగా, ఈ ఫోన్ 20 5G బ్యాండ్స్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ మంచి నెట్ వర్క్ పరిధి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile