లేటెస్ట్ LG Smart Tv సిరీస్ పై బిగ్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

HIGHLIGHTS

LG Smart Tv సిరీస్ పై అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అనౌన్స్ చేసింది

43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ నాలుగు మోడల్స్ పై ఈ డీల్స్ అందించింది

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీలు సౌండ్ పరంగా కూడా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి

లేటెస్ట్ LG Smart Tv సిరీస్ పై బిగ్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG ఇండియాలో కొత్తగా విడుదల చేసిన LG Smart Tv సిరీస్ పై అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ ను లేటెస్ట్ ప్రోసెసర్, A+ గ్రేడ్ LED ప్యానల్ మరియు డాల్బీ అట్మాస్ వంటి మరిన్ని గొప్ప ఫీచర్లు కలిగిన ఈ సిరీస్ స్మార్ట్ టీవీలు ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ తో ఈ బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. అమెజాన్ నుంచి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Smart Tv : డీల్

ఎల్ జి గత సంవత్సరం విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ UA82 Series టీవీలపై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సిరీస్ నుంచి నుంచి అందించి 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ నాలుగు మోడల్స్ పై ఈ డీల్స్ అందించింది. ఈ నాలుగు టీవీ ధరలు మరియు డీల్స్ ఇప్పుడు చూద్దాం.

UA82 సిరీస్ 43 ఇంచ్ టీవీ రూ. 28,990 రూపాయల ప్రైస్ లిస్ట్ అయ్యింది మరియు ఈటీవీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుకుంది. 50 ఇంచ్ టీవీ రూ. 34,990 ప్రైస్ తో రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో మరియు 55 ఇంచ్ టీవీ రూ. 39,990 ధరతో రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో లిస్ట్ అయ్యాయి. అయితే, 65 ఇంచ్ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 57,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. Buy From Here

LG Smart Tv Deals on amazon

అదనంగా, ఈ పైన తెలిపిన నాలుగు ఎల్ జి స్మార్ట్ టీవీ లపై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ టీవీలు మంచి ఆఫర్ ధరలో లభిస్తాయి.

LG Smart Tv : ఫీచర్స్

ఈ సిరీస్ నుంచి ఎల్ జి అందించిన స్మార్ట్ టీవీలు 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు α7 AI Processor 4K Gen8 తో పని చేస్తాయి మరియు 2 జీబీ ర్యామ్ జతగా 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు HDR10 సపోర్ట్, HLG ఫీచర్ మరియు 4K సూపర్ అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తాయి. ఈ టీవీలు LG ThinQ తో WebOS 25 పై నడుస్తాయి.

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీలు సౌండ్ పరంగా కూడా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు AI Sound Pro (Virtual 9.1.2 Up-mix), డాల్బీ అట్మాస్ మరియు AI అకౌస్టిక్ ట్యూనింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఇందులో 10W + 10W రెండు స్పీకర్లు ఉంటాయి మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 2 వే బ్లూటూత్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo