SKOAR! College Cup Delhi Edition గ్రాండ్ ఫినాలే లో కప్ కైవసం చేసుకున్న W2R
Times Network మరియు Digit ప్రజెంట్ చేసిన భారతదేశపు అతిపెద్ద కాలేజ్ ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్, SKOAR! College Cup Delhi Edition యొక్క BGMI LAN ముగిసింది. గంటల తరబడి జరిగిన తీవ్రమైన కాల్పులు మరియు అద్భుతమైన ముగింపు పర్వం తర్వాత, టీమ్ W2R తుది విజేతగా నిలిచింది. ఈ టీమ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది మరియు భారీ బహుమతి పూల్ లో వాటాను అందుకుంది. MVP టైటిల్ టీమ్ వాలర్ నుండి జ్యూసీ కి దక్కింది. ఇందులో మొదటి రన్నరప్ స్థానం Team Invincible కు దక్కగా, మ్యాచ్‌లలో Team Aquila అద్భుతమైన ప్రదర్శన ద్వారా 2వ రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి డ్రాప్ నుంచి ఫైనల్ సర్కిల్ వరకు, వేదిక తమ అభిమాన జట్లకు మద్దతు ఇచ్చే అభిమానులతో నిండిపోయింది. ఈ టోర్నమెంట్ మొదటి రోజు ఎలా జరిగిందో మరియు విజేతల పూర్తి లిస్ట్ గురించి వివరణాత్మక పరిశీలన ఇక్కడ అందించాము.
SurveySKOAR! College Cup Delhi Edition : విన్నర్స్ పూర్తి లిస్ట్
విన్నర్ : Team W2R
1st రన్నర్ అప్: Team Invincible
2nd రన్నర్ అప్: Team Aquila
MVP: Juicy (Team Valor)
ఢిల్లీ పరివాహక ప్రాంతం నుంచి 16 అత్యుత్తమ కళాశాల BGMI జట్లు ఈ పెద్ద వేదిక పై తలపడటంతో, ఇది అధిక అత్యంత ప్రాముఖ్యత కలిగిన LAN షోడౌన్ గా మారింది. ప్రతి మ్యాచ్ అధిక ఉత్సాహం, ఆశ్చర్యకరమైన ఎలిమినేషన్లు మరియు నాటకీయ పునరాగమనాలను తెచ్చిపెట్టింది. టీమ్ Aquila ప్రారంభ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనతో, తీవ్రమైన పోటీదారుడు అనే టోన్‌ను సెట్ చేసింది. రెడ్‌లైన్ రెండవ మ్యాచ్‌లో సమన్వయం మరియు క్రమశిక్షణతో కూడిన ఆటతో ఆధిపత్యం చెలాయించి మరో పోటీదారులుగా లిస్ట్ లో చేరింది. ఇక మూడవ మ్యాచ్ లో, ప్రేక్షకులను చూపు తిప్పుకోలేని అద్భుతమైన క్లాసిక్ విజయంతో టీమ్ BORG వెలుగులోకి వచ్చింది. చివరి మ్యాచ్‌లో, టీమ్ W2R విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది.
ఇప్పుడు, అనుభవజ్ఞులైన ఈ-స్పోర్ట్స్ అభిమానులు అందరికీ తెలిసిందే, అన్ని మ్యాచ్ లు ఒకే స్థాయిలో స్థిరమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారానే అసలు చాంపియన్‌షిప్ లు గెలవబడతాయి. కొన్ని జట్లు కొన్ని సందర్భాలో తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించినప్పటికీ, ప్రతి మ్యాచ్ లోనూ స్థిరమైన ఆటతీరు కనబరిచిన జట్టు మాత్రం టీమ్ W2R మరియు అదే స్థిరత్వం వారికి విన్నర్స్ ట్రోఫీని అందించింది.

ఫైనల్ ఫలితాలు ప్రకటించబడినప్పుడు మరియు ట్రోఫీని ఎత్తి చూపిన ఆ క్షణంలో, వేదికలోని వాతావరణం ఉత్కంఠభరిత స్థాయికి చేరుకుంది. ఆ క్షణం టోర్నమెంట్‌లోని BGMI దశకు ఒక మరపురాని ముగింపుగా నిలిచిపోయింది.
SKOAR! College Gaming Cup Delhi Edition: రెండో రోజు ఏమి ఆశించవచ్చు?
గ్రాండ్ ఫినాలే ప్రస్తుతం గ్రేటర్ నోయిడా లోని Bennett University లో నిర్వహించబడుతోంది. ఈ వేడుకతో యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం ఉత్సాహభరిత ఈ-స్పోర్ట్స్ అరేనాగా మారిపోయింది. మొదటి రోజు BGMI LAN ఫినాలే తో ముగిసినప్పటికీ, అసలు పోటీ ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఫిబ్రవరి 20న దృష్టి మొత్తం వాలరెంట్ పై నిలవనుంది. Riot Games రూపొందించిన ఈ ప్రాచుర్యం పొందిన షూటర్ గేమ్ లో టీమ్స్ తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆధిపత్యం కోసం పోరాడనున్నాయి. అంటే, మరోసారి ఉత్కంఠభరితమైన టాక్టికల్ బ్యాటిల్స్‌కు ఈ వేదిక సిద్ధమైంది.
SKOAR! కాలేజ్ కప్ అనుభవం కేవలం పోటీ మ్యాచ్‌లకే పరిమితం కాలేదు. ప్రధాన వేదికతో పాటు వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SKOAR జోన్ గేమింగ్ కల్చర్‌ను క్యాంపస్ ఎనర్జీతో కలిపి ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పై Live Match ప్రసారం జరుగుతుండటంతో, అభిమానులు ప్రతి క్లచ్ ప్లేను, చివరి క్షణాల్లో జరిగే డిఫ్యూస్ లను ఆస్వాదిస్తున్నారు. హోస్ట్ లు మరియు క్యాస్టర్లు రియల్ టైమ్ విశ్లేషణలతో ప్రేక్షకులను ఉత్సాహంగా ఉంచుతుండగా, వేదిక అంతటా నిర్వహించే ఇంటరాక్టివ్ కార్యకలాపాలు ఎక్కడా కూడా ఉత్సాహాన్ని తగ్గనివ్వడం లేదు.
మొదటి రోజు పవర్ ప్యాక్డ్ ప్రదర్శన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అందరి చూపు వాలరెంట్ ఫైనలే పైనే ఉంది. మరో ట్రోఫీ, మరో ఛాంపియన్, మరెన్నో మరపురాని క్షణాలు SKOAR! కాలేజ్ కప్ ఢిల్లీ ఎడిషన్ రెండో నిర్ణయాత్మక రోజులో ఎదురుచూస్తున్నాయి. పోటీ ఉత్కంఠ కొనసాగుతుండగా మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని అనుసరించండి.
Also Read: స్టన్నింగ్ కెమెరాతో వచ్చిన ViVO V70 ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!