Nothing Phone 3: 60x జూమ్ సపోర్ట్ కలిగిన 50MP పెరిస్కోప్ కెమెరాతో వస్తుంది.!

HIGHLIGHTS

నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్లు ఈరోజు నథింగ్ రివీల్ చేసింది

నథింగ్ ఫోన్ 3 కీలక ఫీచర్లు మరియు స్పెక్స్ వేగంగా బయట పెట్టడం స్టార్ట్ చేసింది

ఈ ఫోన్ గురించి అనేక రూమర్లు మరియు అంచనా ఫీచర్లు చక్కర్లు కొడుతున్నాయి

Nothing Phone 3: 60x జూమ్ సపోర్ట్ కలిగిన 50MP పెరిస్కోప్ కెమెరాతో వస్తుంది.!

Nothing Phone 3: నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్లు ఈరోజు నథింగ్ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడటంతో నథింగ్ ఫోన్ 3 కీలక ఫీచర్లు మరియు స్పెక్స్ వేగంగా బయట పెట్టడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఆన్లైన్ లో ఈ ఫోన్ గురించి అనేక రూమర్లు మరియు అంచనా ఫీచర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కంపెనీ మాత్రం కొన్ని వివరాలు మాత్రం ప్రస్తుతానికి బయట పెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone 3: లాంచ్ అండ్ ఫీచర్స్

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ జూలై 1వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఇండియాలో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ నథింగ్ ఫోన్ 3 సిరీస్ యొక్క ప్రీమియం ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని ఫీచర్స్ వరకు అన్ని కూడా ప్రీమియం గానే ఉండే అవకాశం ఉండవచ్చని రూమర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ లాంచ్ కోసం నథింగ్ చేస్తున్న టీజింగ్ ద్వారా కొన్ని వివరాలు వెల్లడించింది. ఇందులో నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

Nothing Phone 3: కెమెరా

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ ను 50MP పెరిస్కోప్ లెన్స్ తో లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ అనౌన్స్ చేసింది. ఈ సెన్సార్ యొక్క సత్తా తెలిపే ఇతర వివరాలు కూడా ఈ టీజర్ ఇమేజ్ ద్వారా రివీల్ చేసింది. అదేమిటంటే, ఈ సెన్సార్ తో నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్ మరియు 60x అల్ట్రా జూమ్ అందిస్తుంది. అంతేకాదు, నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ కెమెరా 74% సన్నని బంప్ కలిగి ఉంటుందని కూడా నథింగ్ తెలిపింది.

Nothing Phone 3

ముఖ్యంగా, ఈ ఫోన్ లో 10 cm మైక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్ ఉన్నట్లు నథింగ్ వెల్లడించింది. ఈ ఫోన్ కలిగిన ఈ మైక్రో ఫోటోగ్రఫీ ఫీచర్ తో తీసినట్లు చెబుతున్న ఒక ఫోటో కూడా టీజర్ రూపంలో విడుదల చేసింది. ఇందులో ఒక సాలీడు పురుగు క్లోజ్ లుక్ లో కనిపిస్తుంది. ఇందులో సాలీడు పురుగు కళ్ళు సైతం క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కలిగిన మైక్రో ఫోటోగ్రఫీ సత్తా తెలిపేలా ఈ ఇమేజ్ ఉదాహరణ కోసం అందించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: Honor X9c 5G లాంచ్ అనౌన్స్ చేసిన హానర్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

అంచనా స్పెక్స్

ఆండ్రాయిడ్ హెడ్ లైన్స్ నిన్న నథింగ్ ఫోన్ అఫీషియల్ డిజైన్ మరియు అంచనా ఫీచర్స్ సైతం తన పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఇందులో ఈ ఫోన్ ఇండస్ట్రీ ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు ఈ ఇమేజ్ చెబుతోంది. అంతేకాదు, ఈ మూడు కెమెరాలు కూడా 50MP కెమెరాలే అవుతాయని చెబుతోంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతోంది.

అయితే, నథింగ్ అఫీషియల్ గా ఈ ఫోన్ గురించి వెల్లడించే వరకు ఇవన్నీ కూడా అంచనా ఫీచర్స్ గానే మనం తీసుకోవాలి. మరి నథింగ్ ఫోన్ 3 ఎటువంటి ఫీచర్స్ తో అవుతోంది చూద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo