Honor X9c 5G లాంచ్ అనౌన్స్ చేసిన హానర్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Honor X9c 5G ఇండియా లాంచ్ కోసం హానర్ సన్నద్ధమయ్యింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో ఈ ఫోన్ ప్రత్యేకతలు వెల్లడించింది

ఈ హానర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూసేద్దామా

Honor X9c 5G లాంచ్ అనౌన్స్ చేసిన హానర్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Honor X9c 5G ఇండియా లాంచ్ కోసం హానర్ సన్నద్ధమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో ఈ ఫోన్ ప్రత్యేకతలు వెల్లడించింది. ఈ ఫోన్ ను గొప్ప డిస్ప్లే, గొప్ప కెమెరా మరియు పవర్ ఫుల్ బ్యాటరీ వంటి మరిన్ని ప్రత్యేకతలతో ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు హానర్ చెబుతోంది. ఈ హానర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Honor X9c 5G: లాంచ్

హానర్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ భారీగా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ కలిగిన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తుంది మరియు ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తోంది.

Also Read: Smart Tv Offer: జబర్దస్త్ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

Honor X9c 5G : ఫీచర్స్

హానర్ X9c స్మార్ట్ ఫోన్ యొక్క కీలక స్పెక్స్ మరియు ఫీచర్స్ దాదాపు అన్ని వెల్లడించింది. ఈ ఫోన్ స్లిమ్ టైటానియం డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ హానర్ యొక్క అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ టెక్నాలజీ 2.0 తో ఉంటుంది. అంటే, కింద పడినా చెక్కు చెదరని విధమైన ప్రొటెక్ట్ డిజైన్ తో ఉంటుంది.

Honor X9c 5G

ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన గొప్ప డిస్ప్లే ఉంటుంది. ఇది రిస్క్ ఫ్రీ డిమ్మింగ్ తో కళ్ళకు హాని కలిగించని విధంగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది OIS మరియు EIS సపోర్ట్ తో అన్ బ్లర్ ఫోటోలు మరియు అన్ షేక్ వీడియోలను అందిస్తుందని హానర్ తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్ ను గొప్ప బ్యాటరీ లైఫ్ అందించే 6600 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందిస్తుంది. ఈ ఫోన్ IP 65M వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ తో కూడా తీసుకొస్తుంది. ఈ ఫోన్ మ్యాజిక్ OS 9.0 తో హానర్ లాంచ్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo