Smart Tv Offer: జబర్దస్త్ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త

ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఫ్లిప్ కార్ట్ అందించింది

43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 11 వేల రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది

Smart Tv Offer: జబర్దస్త్ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

Smart Tv Offer: అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త. ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 11 వేల రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప డిజైన్ మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smart Tv Offer: ఏమిటా ఆఫర్?

బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్ గా Coocaa బ్రాండ్ కి భారత మార్కెట్లో మంచి పేరుంది. ఈ కూకా బ్రాండ్ ఇండియాలో అందించిన 43 ఇంచ్ 2K రిజల్యూషన్ (FHD) స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ 56% డిస్కౌంట్ తో ఈ టీవీ రూ. 12,999 ధరకు లిస్ట్ అయ్యింది. దీనికి జతగా SBI Credit Card EMI ఆప్షన్ పై రూ. 1299 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 11,700 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

Coocaa (43) FHD LED : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Coolita 3.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు 4 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఆకట్టుకునే విజువల్స్ కూడా అందిస్తుంది.

Smart Tv Offer

ఈ కూకా 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, AV ఇన్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రైమ్ వీడియో, YouTube, జియోసినిమా వంటి మరిన్ని యాప్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీలో Netflix యాప్ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు.

Also Read: Prime Day Sale డేట్ మరియు ఆఫర్స్ అనౌన్స్ చేసిన Amazon

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలను కూడా సంపాదించుకుంది. ఈ బడ్జెట్ ధరలో 43 ఇంచ్ FHD టీవీ కోరుకునే వారు ఈ టీవీ డీల్ ను కూడా పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile