Prime Day Sale డేట్ మరియు ఆఫర్స్ అనౌన్స్ చేసిన Amazon
అమెజాన్ ఇండియా అతిపెద్ద సేల్ Prime Day Sale ను అనౌన్స్ చేసింది
ఈ సేల్ జూలై 12 నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించబడుతుంది
బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అమెజాన్ ఈరోజు వెల్లడించింది
అమెజాన్ ఇండియా అతిపెద్ద సేల్ Prime Day Sale ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ జూలై 12 నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. అమెజాన్ ఈ బిగ్ సేల్ డేట్ తో పాటు కొన్ని బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అమెజాన్ ఈరోజు వెల్లడించింది. అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న డీల్స్ మరియు ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
SurveyAmazon Prime Day Sale
పైన తెలిపినట్లుగా ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12 నుంచి జూలై 14వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్ మరియు ల్యాప్ టాప్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.ఈ అప్ కమింగ్ సేల్ కోసం అమెజాన్ అందించిన టీజర్ పేజి నుంచి ఈ సేల్ నుంచి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్స్ గురించి టీజింగ్ కూడా చేస్తోంది.

ఇక ఈ అప్ కమింగ్ సేల్ బెస్ట్ డీల్స్ విషయానికి వస్తే, శామ్సంగ్, యాపిల్, ఐకూ, వన్ ప్లస్, రియల్ మీ, షియోమీ, లావా మరియు రియల్ మీ బ్రాండ్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. ఇందులో కొని మొబైల్ డీల్స్ కూడా విడుదల చేసింది.
ఏమిటా స్మార్ట్ ఫోన్ డీల్స్?
అమెజాన్ ప్రస్తుతం అందిస్తున్న టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ డీల్స్ గురించి టీజింగ్ చేస్తోంది. ఇందులో శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్ 13s, ఐకూ నియో 10 మరియు యాపిల్ ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
Also Read: Nothing Phone 3 లాంచ్ ముందు Nothing Gallery 2.0 సూపర్ ఫీచర్ ప్రకటించిన నథింగ్.!
మరి స్మార్ట్ టీవీ ఆఫర్స్ మాటేమిటి?
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 నుంచి అందించనున్న స్మార్ట్ టీవీ డీల్స్ కూడా వెల్లడించింది. టీజర్ పేజీ నుంచి ఈ డీల్స్ లిస్ట్ చేసింది. ఇందులో శామ్సంగ్ క్రిస్టల్ 4K వివిద్ ప్రో సిరీస్, షియోమీ QLED సీరీస్, LG OLED Ai సిరీస్ మరియు TCL QD మినీ గూగుల్ టీవీ సిరీస్ టీవీ లను టీజింగ్ ఆఫర్స్ గురించి టీజింగ్ చేస్తోంది.
కేవలం ఈ ఆఫర్స్ మాత్రమే కాదు, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ మరియు ల్యాప్ టాప్ డీల్స్ గురించి కూడా టీజింగ్ చేస్తోంది. ముఖ్యంగా అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఫైర్ టీవీ స్టిక్, ఎకో పాప్, ఎకో షో 8, ఎకో డాట్ 5th జనరేషన్, ఎకో డాట్ 4th జనరేషన్ స్పీకర్లు మరియు కిండల్ పేపర్ వైట్ వంటి వాటిని దాదాపు సగం ధరకే అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.