MOTOROLA Edge 60 Fusion పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
MOTOROLA Edge 60 Fusion పై ఈరోజు ఫ్లిప్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది
ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైంది
ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తుంది
MOTOROLA Edge 60 Fusion స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైంది మరియు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన అన్ని డిస్కౌంట్ ఆఫర్లు అందుకుంటే రూ. 22,999 ధరతో సేల్ అవుతున్న ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 18,499 ధరకే అందుకోవచ్చు. ఈ ఆఫర్ వివరాలు మరియు ఈ ఫోన్ వివరాలు క్లియర్ గా తెలుసుకుందామా.
SurveyMOTOROLA Edge 60 Fusion : ప్రైస్ అండ్ ఆఫర్స్
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 22,999 రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై ఈరోజు రెండు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ చవక ధరలో లభిస్తుంది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రూ. 2,000 నుంచి రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అంటే, ఈ ఫోన్ పై గరిష్టంగా రూ. 4,500 రూపాయలు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఎక్స్ చేంజ్ బోనస్ ప్రతి ఫోన్ పై అందిస్తుంది. Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు పై రూ. 2,000 మరియు IDFC క్రెడిట్ కార్డు ఆప్షన్ పై రూ. 2,500 డిస్కౌంట్ ను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ రెండు ఆఫర్లు అందుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ రేటుకే లభిస్తుంది.
MOTOROLA Edge 60 Fusion : ఫీచర్లు
ఈ మోటోరోలా ఫోన్ స్లీక్ డిజైన్ తో చాలా అందమైన రూపంతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ నాలుగు అందమైన రంగుల్లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ ఆల్ కర్వుడ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో గొప్ప విజువల్స్ మరియు మంచి గేమింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ మరియు OS అప్డేట్స్ అందుకుంటుందని మోటోరోలా హామీ ఇచ్చింది. ఈ మోటోరోలా ఫోన్ DOlby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.
Also Read: బిగ్ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv ఇదే.!
ఈ ఫోన్ నాలో గొప్ప కెమెరా సెటప్ కూడా అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony LYTIA 700C) మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు మూడవ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో (30fps), 120fps స్లో మోషన్ వీడియో, నైట్ విజన్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ మరియు 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.