Moto G86 Power 5G: లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

మోటోరోలా జి సిరీస్ నుంచి Moto G86 Power 5G ఫోన్ లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా రెండు రోజులు ఉంది

రెండు రోజులు ముందే ఈ అప్ కమింగ్ మోటో స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ అందించాము

Moto G86 Power 5G: లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!

Moto G86 Power 5G: మోటోరోలా జి సిరీస్ నుంచి జి86 పవర్ 5జి ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ఎల్లుండి, అనగా జూలై 30న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా రెండు రోజులు ఉంది. అయితే, రెండు రోజులు ముందే ఈ అప్ కమింగ్ మోటో స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ వివరాలు మీకు అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G86 Power 5G: కంప్లీట్ ఫీచర్లు

మోటోరోలా ఈ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ట్రెండీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో పెద్ద 6720 mAh బిగ్ బ్యాటరీ తో అందిస్తుంది. ఈ ఫోన్ డిజైన్ ను కూడా ఫ్లాట్ స్క్రీన్ మరియు ఫ్లాట్ బ్యాక్ డిజైన్ తో ఆకట్టుకునేలా అందించింది. ఇది వేగాన్ లెథర్ డిజైన్ లో మూడు కొత్త రంగుల్లో వస్తుంది. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంటుంది మరియు ఈ డిస్ప్లే 4500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ మరియు గేమింగ్ కి తగినదిగా ఉంటుందని మోటోరోలా తెలిపింది.

ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400 తో మోటోరోలా లాంచ్ చేస్తుంది. ఈ ప్రోసెసర్ తో పాటు 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 16 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ 3.0 సపోర్ట్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Hello UI సాఫ్ట్ వేర్ ఆధారితమైన ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది. ఈ మోటో ఫోన్ స్మార్ట్ కనెక్ట్, స్వైప్ టు షేర్ మరియు స్వైప్ టు స్ట్రీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Moto G86 Power 5G Specs

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP (Sony LYT-600) మెయిన్ కెమెరా 8MP అల్ట్రా వైడ్ కెమెరా జతగా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మోటో Ai తో AI కెమెరా ఫీచర్లు మరియు మంచి స్టెబిలిటీ కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ను కూడా కలిగి ఉంటుంది.

ఇక ఫోన్ బిల్డ్ మరియు ఆడియో వివరాలు చూస్తే, ఈ ఫోన్ MIL-810H సర్టిఫికేషన్ తో మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్ తో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లోని స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ గట్టిగా ఉంటుందని మోటోరోలా ఈ ఫోన్ గురించి చెబుతోంది. ఇది కాకుండా, ఈ ఫోన్ IP 68 + IP 69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది మరియు ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

Also Read: Vivo T4R: IP 69 రేటింగ్ మరియు కంప్లీట్ 4K కెమెరాలతో లాంచ్ అవుతుంది.!

Moto G86 Power 5G: అంచనా ధర

ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు డిజైన్ పరంగా లెక్కించి ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 ఫోన్ గా లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ అంచనా ప్రైస్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి అంటున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo