Vivo T4R: IP 69 రేటింగ్ మరియు కంప్లీట్ 4K కెమెరాలతో లాంచ్ అవుతుంది.!
Vivo T4R కొత్త ఫీచర్లను వివో అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది
కంప్లీట్ 4K కెమెరాలు ఉన్నట్లు వివో ఈ ఫోన్ గురించి కొత్తగా టీజింగ్ చేస్తోంది
Vivo T4R : వివో అప్ కమింగ్ లాంచ్ కోసం ప్రారంభించిన టీజింగ్ లో భాగంగా నేడు మరిన్ని కొత్త ఫీచర్లను వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ ని తెలిపేలా ముందుగా హింట్ అందించిన వివో ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లో IP 69 రేటింగ్ మరియు కంప్లీట్ 4K కెమెరాలు ఉన్నట్లు వివో ఈ ఫోన్ గురించి కొత్తగా టీజింగ్ చేస్తోంది.
SurveyVivo T4R: లాంచ్ అండ్ ఫీచర్స్
వివో ఈ ఫోన్ ను జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా టీజ్ అవుతోంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కెమెరా మరియు ఇతర ఫీచర్స్ గురించి ఈరోజు ఈ పేజీ నుంచి వివో వివరాలు వెల్లడించింది.
వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 5జి ప్రోసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఇది 5జి చిప్ సెట్ మరియు 4nm ప్రోసెస్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2.6GHz క్లాక్ స్పీడ్ మరియు 750K కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 68 మరియు IP 69 రేటింగ్ తో ఇండస్ట్రీ లీడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని వివో చెబుతోంది.

ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు కూడా ఈరోజు వివో వెల్లడించింది. వివో టి4ఆర్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా లో 50MP Sony (OIS) మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో అందించి రియర్ మరియు సెల్ఫీ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.
ఇది కాకుండా ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కలిగిన ఫోన్స్ లో సన్నని ఫోనుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Also Read: శాంసంగ్ 55 ఇంచ్ బెస్ట్ సెల్లింగ్ 4K Smart Tv పై బెస్ట్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
Vivo T4R: ప్రైస్
ఈ ఫోన్ ప్రోసెసర్ గురించి టీజింగ్ చేసే ప్రోసెస్ లో ఈ అంచనా ధర వివరాలు వివో టీజింగ్ చేసింది. ఈ ఫోన్ అండర్ రూ. 20,000 సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ అవుతుందని వివో తెలిపింది. అంటే, ఈ ఫోన్ రూ. 20,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది.