సోమవారం నుంచి Galaxy A-series స్మార్ట్ ఫోన్స్ ధర భారీగా పెరిగే అవకాశం.. ఏమిటి ఈ కొత్త కథ.!

HIGHLIGHTS

Samsung Galaxy A-series స్మార్ట్ ఫోన్ ప్రైస్ లో గొప్ప మార్పులు జరగవచ్చని మార్కెట్ వర్గాలు గుసగుస

ఈ ప్రైస్ హైక్ గురించి అనేక వార్తలు నెట్టింట్లో శరవేగంగా రౌండ్స్ కొడుతున్నాయి

ప్రముఖ టిప్స్టర్ లు మొదలుకొని మార్కెట్ వర్గాల వరకు అందురూ ఇదే మాట చెబుతున్నారు

సోమవారం నుంచి Galaxy A-series స్మార్ట్ ఫోన్స్ ధర భారీగా పెరిగే అవకాశం.. ఏమిటి ఈ కొత్త కథ.!

Samsung Galaxy A-series స్మార్ట్ ఫోన్ ప్రైస్ లో గొప్ప మార్పులు జరగబోతున్నాయా? అని అడిగితే, నిజమే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రముఖ టిప్స్టర్ లు మొదలుకొని మార్కెట్ వర్గాల వరకు అందురూ ఇదే మాట చెబుతున్నారు. అయితే, ఈ విషయం పై ఇప్పటి వరకు శాంసంగ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈ ప్రైస్ హైక్ గురించి అనేక వార్తలు నెట్టింట్లో శరవేగంగా రౌండ్స్ కొడుతున్నాయి. అసలు ఈ కొత్త శాంసంగ్ ప్రైస్ హైక్ కథేమిటో విశదీకరించి చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy A-series : ప్రైస్ పెరగడం నిజమేనా?

శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ పెరడం అనే మాట నిజమేనా? అని అడిగితే, కచ్చితంగా అవును అని చెప్పలేము. ఎందుకంటే, కంపెనీ ఈ ఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ గురించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే, అభిషేక్ యాదవ్ వంటి ప్రముఖ టిప్స్టర్ ఈ ఫోన్ ప్రైస్ పెరగడం గురించి చేసిన ట్వీట్ చూస్తుంటే, ఇది నిజం కావచ్చు అనిపిస్తుంది.

Samsung Galaxy A-series Price Hike

నిజానికి, శాంసంగ్ సాధారణంగా ధర పెంపు గురించి ముందుగా ప్రకటించదు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో డైరెక్ట్ గా ధరలు అప్‌డేట్ చేయడం మరియు రిటైల్ స్టోర్లకు కొత్త ప్రైస్ లిస్ట్ పంపడం వంటివి మాత్రమే చేస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఈ కొత్త ప్రైస్ గురించి వివరాలు అందిస్తాయి. కొత్తగా వచ్చిన మీడియా రిపోర్ట్స్ మరియు ఇండస్ట్రీ లీక్‌లు ఆధారంగా ఈ కొత్త సమాచారం బయటకు వచ్చింది.

Also Read: బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!

Samsung Galaxy A-series : లీక్స్ ఏమి చెబుతున్నాయి?

ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న కొత్త లీక్స్ ద్వారా శాంసంగ్ ఎ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ధర రూ. 1,000 పెరుగుతుందని చెబుతున్నారు. అయితే, శాంసంగ్ గెలాక్సీ A56 స్మార్ట్ ఫోన్ మాత్రం ఏకంగా రూ. 2,000 పెరుగుతుందట. ఈ ప్రైస్ నిజంగా పెరుగుతుందో లేదో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాలి.

ఒకవేళ శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ నుంచి ఒక మంచి ఫోన్ కొనాలని చూస్తుంటే మాత్రం ఈ రోజు కొనుగోలు చేయండి మంచి అవకాశం అవుతుంది. ప్రస్తుతం శాంసంగ్ సైట్ నుంచి లిస్ట్ అయిన గెలాక్సీ A సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A06 (4జీబీ + 64జీబీ): రూ. 10,499

శాంసంగ్ గెలాక్సీ A07 (4జీబీ + 64జీబీ): రూ. 9,749

శాంసంగ్ గెలాక్సీ A17 (6జీబీ + 128జీబీ): రూ. 19,499

శాంసంగ్ గెలాక్సీ A26 (8జీబీ + 128జీబీ): రూ. 23,999

శాంసంగ్ గెలాక్సీ A36 (8జీబీ + 128జీబీ): రూ. 30,999
శాంసంగ్ గెలాక్సీ A56 (8జీబీ + 128జీబీ): రూ. 38,999

ఈ ప్రైస్ తో ఈ ఫోన్లు శామ్ శాంసంగ్ అధికారిక సైట్ నుంచి లిస్ట్ అయ్యాయి. ఒకవేళ ఈ ఫోన్ రేట్లు పెరిగితే కొత్త ప్రైస్ లిస్ట్ ను మీ ముందుకు తీసుకొస్తాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo