Lava Blaze Dragon: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన లావా.. ప్రైస్ ఎంతంటే.!
భారతీయ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ లావా ఈరోజు కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసింది
Lava Blaze Dragon ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ని క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో తీసుకు వచ్చింది
Lava Blaze Dragon : భారతీయ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ లావా ఈరోజు కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసింది. అదే, లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు ఈ ఫోన్ ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. లావా కొత్తగా రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ వివరంగా చూద్దాం.
SurveyLava Blaze Dragon: ప్రైస్
లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 8,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ గోల్డెన్ మిస్ట్ మరియు మిడ్ నైట్ మిస్ట్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు లావా అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Also Read: లేటెస్ట్ LG 4K Smart Tv పై భారీ ఆఫర్లు అనౌన్స్ చేసిన అమెజాన్.!
Lava Blaze Dragon: ఫీచర్లు
లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే స్లీక్ డిజైన్ తో మరియు రెండు సరికొత్త కలర్ ఆప్షన్ లో అందించింది. ఈ ఫోన్ ని క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో తీసుకు వచ్చింది. ఈ చిప్ సెట్ 4 లక్షల 50 వేలకు పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని లావా తెలిపింది. ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చడానికి వీలుగా 4GB ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ని కూడా అందించింది. ఈ ఫోన్ అన్ని మేజర్ 5జి బ్యాండ్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ లో 6.75 ఇంచ్ 2.5D బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఈ డిస్ప్లే HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50MP AI మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో వాటర్ డ్రాప్ నోచ్ సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ AI మోడ్, HDR మోడ్, నైట్ మోడ్ మరియు AR స్టికర్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ కలిగి ఉంటుంది.
ఈ లావా స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 OS పియా నడుస్తుంది. ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ ను లావా అందించింది.