iQOO Neo 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ, ఐకూ ఈ ఫోన్ టీజింగ్ వేగాన్ని మరింత పెంచుతోంది. ఈ ఫోన్ స్థిరమైన 90fps గేమింగ్ అందించే సూపర్ రిజల్యూషన్ డిస్ప్లే మరియు ఫాస్ట్ చి సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ గేమింగ్ టెస్ట్ ను కూడా డిజిట్ నిర్వహించింది. ఇందులో కూడా ఇది గొప్ప రిజల్ట్స్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Neo 10R: ఫీచర్స్
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా ఉంటుందని ఐకూ తెలిపింది. ఈ ఫోన్ వచ్చే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఫోన్ అవుతుంది. చెప్పిన విధంగానే ఈ ఫోన్ ను Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. దినికి జతగా ఫాస్ట్ ర్యామ్ మరియు అధిక ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్టేబుల్ 90 FPS గేమింగ్ అందించే బిగ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ దొరిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది.
మరిన్ని ఫీచర్ల వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో ఈ ఫోన్ లో 6400 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ ను ఐకూ అందించింది. అంతేకాదు, ఈ బిగ్ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను చాలా వేగంగా చల్లబరిచే అతిపెద్ద కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ మరియు మూన్ నైట్ టైటానియం రెండు కలర్ లలో లాంచ్ చేస్తుంది. ఐకూ నియో 10R ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.