iQOO 13 Ace Green లాంచ్ అయ్యింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
iQOO 13 Ace Green వేరియంట్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త గ్రీన్ కలర్ మరియు వెనుక గ్రీన్ కలర్ LED లైట్ తో గొప్ప డిజైన్ తో వచ్చింది
ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో పని చేస్తుంది
iQOO 13 Ace Green వేరియంట్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త గ్రీన్ కలర్ మరియు వెనుక గ్రీన్ కలర్ LED లైట్ తో గొప్ప డిజైన్ తో వచ్చింది. ఐకూ ఇటీవల విడుదల చేసిన ఐకూ 13 స్మార్ట్ ఫోన్ యొక్క మూడవ వేరియంట్ గా ఈ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ ఐకూ 13 ఏస్ గ్రీన్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
iQOO 13 Ace Green : ప్రైస్
ఐకూ 13 ఏస్ గ్రీన్ వేరియంట్ రూ. 54,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జూలై 12 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు ఐకూ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై SBI మరియు ICICI బ్యాంక్ తో పాటు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 52,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
iQOO 13 Ace Green : ఫీచర్లు
ఈ ఐకూ కొత్త ఎడిషన్ కూడా అదే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో డిస్ప్లే మరియు గేమింగ్ కోసం ఐకూ సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ ను కూడా అందించింది. ఇది 16 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు కొత్త గ్రీన్ కలర్ లో మనసు దోచుకునే లుక్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 ఇంచ్ Q10 LTPO AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh సిలికాన్ 3వ జనరేషన్ బ్యాటరీ మరియు 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: Tecno Pova 7: బడ్జెట్ ధరలో యూనిక్ డిజైన్ తో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.!
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX921 VCS ట్రూ కలర్ ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ తో పాటు 60 fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.