Tecno Pova 7: బడ్జెట్ ధరలో యూనిక్ డిజైన్ తో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.!
టెక్నో ఈరోజు పోవ 7 5జి సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది
Tecno Pova 7 యూనిక్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
టెక్నో పోవ స్మార్ట్ ఫోన్ డెల్టా ఇంటర్ఫేస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది
Tecno Pova 7: టెక్నో ఈరోజు పోవ 7 5జి సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లను యూనిక్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. టెక్నో పోవ 7 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త ట్రయాంగిల్ మినీ LED సెటప్ మరియు వెనుక యూనిక్ డిజైన్ తో పాటు NFC వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.
Tecno Pova 7: ప్రైస్
టెక్నో పోవ స్మార్ట్ ఫోన్ బేసిక్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 14,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హైఎండ్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 15,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. జూలై 12వ తేదీ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Tecno Pova 7: ఫీచర్లు
టెక్నో పోవ స్మార్ట్ ఫోన్ డెల్టా ఇంటర్ఫేస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో కెమెరా వెనుక ట్రయాంగిల్ షేప్ లో మినీ LED ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 అల్టిమేట్ ఆక్టాకోర్ ప్రోసెసర్ తో వచ్చింది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ HD గేమింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AIGC పోర్ట్రైట్,, AI కెమెరా ఫీచర్స్, పోర్ట్రైట్ , సూపర్ నైట్ మోడ్ వంటి చాలా ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా 30fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: 5.1 Soundbar: 5 వేల బడ్జెట్ లభించే బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్స్ ఇవిగో.!
టెక్నో పోవ 7 5జి స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Ella AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నో నెట్ వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.