iPhone 13 Price Cut: సగం ధరకే లభిస్తున్న ఐఫోన్ 13 ఫోన్.!
ఐఫోన్ 17 సిరీస్ విడుదల చేసిన తర్వాత పాత సిరీస్ ఫోన్స్ మరింత చవక ధరకు లభిస్తున్నాయి
ముఖ్యంగా ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది
సగం కంటే ఎక్కువ డిస్కౌంట్ తో కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తుంది
iPhone 13 Price Cut: ఆపిల్ ఇండియాలో 17 సిరీస్ ఐఫోన్లు విడుదల చేసిన తర్వాత పాత సిరీస్ ఫోన్స్ మరింత చవక ధరకు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో విడుదులైన రేటుతో పోలిస్తే సగం కంటే ఎక్కువ డిస్కౌంట్ తో కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తుంది. బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలని చూసే వారు ఇప్పుడు బడ్జెట్ లభిస్తున్న ఐఫోన్ 13 ఫోన్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyiPhone 13 Price Cut
2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 13 ఇండియాలో రూ. 79,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ రూ. 45,990 రూపాయల ధరతో సేల్ అవుతోంది. కానీ, అమెజాన్ ఈ ఫోన్ ను మరింత డిస్కౌంట్ తో రూ. 43,900 రూపాయల అతి తక్కువ ధరలో సేల్ చేస్తోంది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈ ఫోన్ ఏకంగా రూ. 36,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది.
ఇది కాకుండా, ఐఫోన్ 13 పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా నుండి SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయలు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ. 42,900 రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
Also Read: Price Cut: లేటెస్ట్ కర్వుడ్ డిస్ప్లే ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
iPhone 13 : ఫీచర్స్
ఐఫోన్ 13 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సినిమాటిక్ మోడ్ మరియు మంచి రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది మూవీలు మరియు వీడియోలు చూడటానికి గొప్పగా ఉంటుంది. ఈ ఫోన్ A15 Bionic చిప్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ iOS 14 తో వస్తుంది మరియు ఆపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన iOS 26 లిక్విడ్ గ్లాస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు బ్లూ, గ్రీన్, మిడ్ నైట్ మరియు స్టార్ లైట్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఐఫోన్ 13 కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 12MP డ్యూయల్ రియర్ మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Smart HDR 4, ఫోటోగ్రాఫిక్ స్టైల్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ వాటర్ రెసిస్టెంట్ మరియు ఫేస్ రికగ్నైజేషన్ వంటి ఫీచర్స్ తో గట్టి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక రోజు బ్యాకప్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.