Price Cut: లేటెస్ట్ కర్వుడ్ డిస్ప్లే ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Realme NARZO 80 Pro 5G పై భారీ డిస్కౌంట్ ను అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది
ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,498 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది
Price Cut: రియల్ మీ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ కర్వుడ్ డిస్ప్లే ఫోన్ Realme NARZO 80 Pro 5G పై భారీ డిస్కౌంట్ ను అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ వివరాలు అందిస్తున్నాము.
SurveyRealme NARZO 80 Pro 5G Price Cut ఏమిటి?
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 17,498 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,498 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Aadhaar on WhatsApp: వాట్సాప్ లో మీ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.!
Realme NARZO 80 Pro 5G: ఫీచర్స్
రియల్ మీ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో వచ్చిన సెగ్మెంట్ మొదటి స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన హైపర్ గ్లో AMOLED Esports స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90 FPS BGMI కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP 69 రేటింగ్ తో మంచి వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony IMX 882) మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే మంచి డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది.