Infinix Smart 9HD: స్ట్రాంగ్ బిల్డ్ మరియు కొత్త డిజైన్ తో వస్తోందని కంపెనీ టీజింగ్.!

HIGHLIGHTS

ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ కోసం ఇన్ఫినిక్స్ సిద్ధమవుతోంది

ఇన్ఫినిక్స్ యొక్క స్మార్ట్ HD సిరీస్ నుం సి ఈ అప్ కమింగ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది

Infinix Smart 9HD స్ట్రాంగ్ బిల్డ్ మరియు కొత్త డిజైన్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది

Infinix Smart 9HD: స్ట్రాంగ్ బిల్డ్ మరియు కొత్త డిజైన్ తో వస్తోందని కంపెనీ టీజింగ్.!

Infinix Smart 9HD: ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ కోసం ఇన్ఫినిక్స్ సిద్ధమవుతోంది. ఇన్ఫినిక్స్ యొక్క స్మార్ట్ HD సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ మరియు డిజైన్ వివరాలు తెలియ చేసే టీజర్ వీడియోను ఇన్ఫినిక్స్ విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ ఫోన్ స్మార్ట్ 9HD స్మార్ట్ ఫోన్ ను స్ట్రాంగ్ బిల్డ్ మరియు కొత్త డిజైన్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Smart 9HD: లాంచ్ డేట్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇన్ఫినిక్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ‘Coming Soon’ ట్యాగ్ తో ఈ ఫోన్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ విడుదల తర్వాత Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది.

Infinix Smart 9HD: ఫీచర్స్

ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Smart 9HD ఫోన్ చాలా పటిష్టమైన డిజైన్ సాలిడ్ బిల్డ్ తో ఉంటుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ 2,50,000 టైమ్స్ డ్రాప్ టెస్ట్ ను తట్టుకుని నిలడినట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో మంచి పటిష్టమైన ఫోన్ గా నిలుస్తుందని కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది.

Infinix Smart 9HD

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD ఫోన్ లో సెంటర్ పంచ్ సెల్ఫీ కెమెరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ మరియు టైప్ C ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుందని టీజింగ్ ద్వారా కంపెనీ వెల్లడించింది. ఇది కాకుండా ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కనిపిస్తోంది మరియు మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుంది.

Also Read: Realme ANC నెక్ బ్యాండ్ ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది.!

ఈ ఫోన్ మింట్ గ్రీన్, కొరల్ గోల్డ్ మరియు మెటాలిక్ బ్లాక్ మూడు కలర్స్ లో వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD లో వె నూక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo