HIGHLIGHTS
Buds Wireless 5 ANC మొదటి సేల్ రేపు మొదలవుతుంది
Realme ANC నెక్ బ్యాండ్ గొప్ప బ్యాటరీ మరియు ANC సపోర్ట్ తో వచ్చింది
ఈ నెక్ బ్యాండ్ 50dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది
Realme ANC నెక్ బ్యాండ్ Buds Wireless 5 ANC మొదటి సేల్ రేపు మొదలవుతుంది. గత వారం మార్కెట్ లో విడుదల చేయబడిన ఈ నెక్ బ్యాండ్ గొప్ప బ్యాటరీ మరియు ANC సపోర్ట్ తో వచ్చింది. ఈ కొత్త నెక్ బ్యాండ్ సేల్ కంటే ముందుగా మీరు తెలుసుకోవలసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వుంది.
Surveyరియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 ANC ని కేవలం రూ. 1,799 ధరతో విడుదల చేసింది మరియు లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 200 తగ్గింపుతో రూ. 1,599 ఆఫర్ తో అందిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ డాన్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ మరియు ట్విలైట్ పర్పల్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ realme.com మరియు అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Republic Day Big Bonanza సేల్ నుంచి Sony 5.1 Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
రియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నెక్ బ్యాండ్ 50dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ ఈ బడ్స్ ను ఈ సెగ్మెంట్ లో గొప్పగా నిలుపుతుంది అని రియల్ మీ తెలిపింది. ఈ రియల్ మీ కొత్త నెక్ బ్యాండ్ ENC Call నోయిస్ క్యాన్సిలేషన్ మరియు అడాప్టివ్ 3 లెవల్ నోయిస్ రిడక్షన్ తో కూడా వస్తుంది.

ఈ రియల్ మీ నెక్ బ్యాండ్ 13.6mm డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ నెక్ బ్యాండ్ డైనమిక్ ఆడియో మరియు 360 డిగ్రీ స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ ఫీచర్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ మరియు IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ టోటల్ 38 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. అయితే, ANC On లో ఉన్నప్పుడు 20 గంటల ప్లేబ్యాక్ మాత్రమే అందిస్తుంది.