Infinix HOT 60 5G : చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
ఇన్ఫినిక్స్ ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
Infinix HOT 60 5G ఫోన్ ను చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
Infinix HOT 60 5G: భారత్ లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న బ్రాండ్ లలో ఇన్ఫినిక్స్ కూడా ఒకటి . ఈ ఈరోజు ఈ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు వివరంగా చూద్దామా.
SurveyInfinix HOT 60 5G : ప్రైస్
ఇన్ఫినిక్స్ హాట్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 10,499 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ కేరమెల్ గ్లో, షాడో బ్లూ, స్లీక్ బ్లాక్ మరియు టండ్రా గ్రీన్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
Infinix HOT 60 5G : ఫీచర్స్
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 5 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7020 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 6 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ XOS15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన ఇన్ఫినిక్స్ AI బటన్ తో కూడా వస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 90FPS గేమింగ్ సపోర్ట్ తో ఉంటుందని మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ తెలిపింది.
Also Read: ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి Motorola Dolby Atmos సౌండ్ బార్ చవక ధరలో లభిస్తుంది.!
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరాని LED ఫ్లాష్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ AI Cam, Beauty, సూపర్ నైట్, పోర్ట్రైట్ మరియు AIGC Portrait వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5200 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.