భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదలైన Infinix GT 30 5G స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

Infinix GT 30 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను గేమర్స్ కోసం అవసరమైన మరిన్ని కంట్రోల్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ పై ఫస్ట్ డే బెస్ట్ డీల్ ఆఫర్ అందించింది

భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదలైన Infinix GT 30 5G స్మార్ట్ ఫోన్.!

Infinix GT 30 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను గేమర్స్ కోసం అవసరమైన మరిన్ని కంట్రోల్స్ తో లాంచ్ చేసింది. రీసెంట్ గా ఇన్ఫినిక్స్ ఇదే సిరీస్ నుంచి విడుదల చేసిన GT 30 Pro 5G యొక్క బేసిక్ వెర్షన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది బేసిక్ వేరియంట్ అయినా సరే ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ విడుదలైన ప్రైస్ సెగ్మెంట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెబుతున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix GT 30 5G : ప్రైస్

ఈ కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ రూ. 19,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 జీబీ +128 జీబీ) కోసం రేటు నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై ఫస్ట్ డే బెస్ట్ డీల్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ మరియు రూ. 1,500 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఇందులో ఏదైనా ఒక డీల్ అందుకోవచ్చు మరియు ఇది కేవలం ఒక్కరోజు ఆఫర్ గా మాత్రమే అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుంది.

Infinix GT 30 5G : ఫీచర్స్

ఇన్ఫినిక్స్ జిటి 30 స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ మరియు గేమింగ్ కోసం అవసరమైన షోల్డర్ ట్రిగ్గర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక గేమ్ తో లయబద్దంగా వెలిగే సైబర్ మెచ్చా 2.0 గేమింగ్ లైట్స్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించే 6.78 ఇంచ్ 144 Hz AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు ఇన్ స్క్రీన్ డిస్ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Infinix GT 30 5G

జిటి 30 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 5G ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ఫిజికల్ ర్యామ్ 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో, గేమింగ్ కోసం XBoost AI ప్రో లెవల్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది 90FPS BGMI గేమింగ్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Flipkart Freedom Sale చివరి రోజు భారీ 55 ఇంచ్ Smart Tv డీల్ ప్రకటించింది.!

కెమెరా పరంగా, ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 64MP Sony మెయిన్ మరియు 8MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫిల్టర్లు, FHD వీడియో రికార్డింగ్ మరియు సూపర్ నైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W స్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo