Flipkart Freedom Sale చివరి రోజు భారీ 55 ఇంచ్ Smart Tv డీల్ ప్రకటించింది.!
Flipkart Freedom Sale అర్ధరాత్రి తో ముగుస్తుంది
5 ఇంచ్ Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
ఈ టీవీ HDR 10, డాల్బీ విజన్ మరియు MEMC ఫీచర్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది
Flipkart Freedom Sale ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది మరియు ఈరోజు భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ లో ఒక స్మార్ట్ టీవీ డీల్ బడ్జెట్ యూజర్ల కోసం సరిపోయేలా అనిపిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు బడ్జెట్ యూజర్ల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేమిటంటే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క సబ్ బ్రాండ్ iFFALCON రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ డీల్ ను ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.
SurveyFlipkart Freedom Sale : Smart Tv డీల్
ఈ డీల్ విషయానికి వస్తే ఐఫాల్కన్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ (55U65) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 64% భారీ డిస్కౌంట్ ను అందించింది. ఫ్రీడమ్ సేల్ చివరి ఈరోజు అందించిన ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 ధరలో సేల్ అవుతుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుకోవచ్చు. ఈ టీవీని ICICI, BOBCARD మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
iFFALCON (55) Smart Tv : ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన A గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది, ఈ టీవీ HDR 10, డాల్బీ విజన్ మరియు MEMC ఫీచర్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో పని చేస్తుంది, ఇందులో 2జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ సపోర్ట్ కూడా అందించారు. ఈ టీవీ అంచులు లేని విధంగా కనిపించే బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 24 W సౌండ్ అవుట్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ స్మార్ట్ టీవీ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, AV ఇన్, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది.
Also Read : AI దెబ్బకు 2027 నాటికి మధ్యతరగతి సంక్షోభం తప్పదంటున్న మాజీ Google ఎగ్జిక్యూటివ్, Mo Gawdat
ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ అందుకుంది మరియు బడ్జెట్ బెస్ట్ టీవీ గా రివ్యూలు కూడా అందుకుంది.