Google Pixel 10 Pro మరియు 10 Pro XL నెక్స్ట్ లెవెల్ కెమెరాతో విడుదలయ్యాయి.!
Google Pixel 10 Pro మరియు 10 Pro XL నెక్స్ట్ లెవెల్ కెమెరాతో విడుదలయ్యాయి
బ్యాటరీ మరియు డిస్ప్లే సైజుల్లో తప్ప ఈ రెండు ఫోన్లు కూడా ఒకే ఫీచర్స్ కలిగి ఉంటాయి
ఈ లేటెస్ట్ ఫోన్స్ తో పాటు రూ. 23,400 విలువైన ఉచిత లాభాలు కూడా గూగుల్ అందించింది
Google Pixel 10 Pro మరియు 10 Pro XL నెక్స్ట్ లెవెల్ కెమెరాతో విడుదలయ్యాయి. ఈ మాట నేను చెప్పడం లేదు స్వయానా గూగుల్ ఈ ఫోన్ గురించి ఇలా చెబుతోంది. బ్యాటరీ మరియు డిస్ప్లే సైజుల్లో తప్ప ఈ రెండు ఫోన్లు కూడా ఒకే ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ లేటెస్ట్ ఫోన్స్ తో పాటు రూ. 23,400 విలువైన ఉచిత లాభాలు కూడా గూగుల్ అందించింది. ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ మరియు స్పెక్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyGoogle Pixel 10 Pro మరియు 10 Pro XL : ఫీచర్స్
ఈ రెండు ఫోన్లు కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కలిగిన సూపర్ ఆక్టువా స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు ఫోన్ల స్క్రీన్ సైజులో మాత్రం మార్పు ఉంటుంది. వీటిలో పిక్సెల్ 10 ప్రో 6.3 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటే, 10 ప్రో ఎక్స్ఎల్ మాత్రం 6.8 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ రెండు ఫోన్లు కూడా గూగుల్ Tensor G5 ప్రోసెసర్ మరియు జతగా Titan M2 security కో ప్రోసెసర్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా 16GB ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.

ఈ రెండు ఫోన్లు కూడా నెక్స్ట్ లెవెల్ కెమెరాలు కలిగి ఉంటాయి. ఈ గూగుల్ ఫోన్స్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP వైడ్, 48MP అల్ట్రా వైడ్ (Macro Focus) మరియు 48MP (5x) టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇందులో 48MP డ్యూయల్ PD సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరా 8K అండ్ 4K వీడియో రికార్డింగ్, ప్రో కంట్రోల్స్, కెమెరా కోచ్, AI కెమెరా ఫీచర్స్, పిక్సెల్ స్టూడియో వంటి టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ Gemini Live సపోర్ట్ తో వస్తుంది మరియు మ్యాజిక్ క్యూ, సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్లేట్, కాల్ అసిస్టెంట్ వంటి మరిన్ని గూగుల్ Ai ఫీచర్స్ కూడా లాగి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ రూ. 23,400 రూపాయల విలువైన Google AI Pro వన్ ఇయర్ యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఎమర్జెన్సీ SOS, కార్ క్రాష్ డిటెక్షన్, సేఫ్టీ చెక్, థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్ల బ్యాటరీ లలో కొంత మార్పు ఉంటుంది. వీటిలో పిక్సెల్ 10 ప్రో 4870 mAh బ్యాటరీ కలిగి ఉంటే, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ మాత్రం 5,200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: స్టన్నింగ్ ఫీచర్స్ మరియు ప్రైస్ తో Pixel Buds 2a లాంచ్ చేసిన గూగుల్.!
Google Pixel 10 Pro మరియు 10 Pro XL : ప్రైస్

గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్మార్ట్ రూ. 1,09,999 రూపాయల ధరతో విడుదలైతే, పిక్సెల్ 10 ప్రో XL మాత్రం 1,24,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ రెండు ఫోన్లు కూడా ప్రీ ఆర్డర్ కి అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్స్ పై రూ. 10,000 వరకు ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు రూ. 5,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లు అందించింది.