బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ Realme NARZO 80 Pro 5G పై గొప్ప డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Realme NARZO 80 Pro 5G పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ అందించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే అందించిన డీల్

ఈ ఫోన్ ను కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ Realme NARZO 80 Pro 5G పై గొప్ప డిస్కౌంట్ అందుకోండి.!

రియల్ మీ రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ Realme NARZO 80 Pro 5G పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే అందించిన ఈ డీల్ తో ఈ ఫోన్ ను కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ, 4500 నిట్స్ డిస్ప్లే మరియు బడ్జెట్ పవర్ ఫుల్ చిప్ సెట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme NARZO 80 Pro 5G పై డిస్కౌంట్ ఆఫర్స్ ఏమిటి?

రియల్ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 19,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి అమెజాన్ ఈ ఫోన్ ను కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మూడు వేరియంట్స్ పై కూడా రూ. 2,000 తగ్గింపు అందించింది. ఈ ఫోన్ పై అందించిన No Cost EMI ద్వారా తీసుకునే యూజర్లకు రూ. 1,116 వడ్డీ మిగులుతుంది.

Also Read: Amazon Great Indian Festival Sale డేట్ మరియు ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Realme NARZO 80 Pro 5G : ఫీచర్స్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 12 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.53mm మందంతో చాలా సన్నగా ఉంటుంది మరియు 179 గ్రాములతో చాలా తేలికగా ఉంటుంది. ఈ రియల్ స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ హైపర్ గ్లో ఫీచర్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.

Realme NARZO 80 Pro 5G

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 మెయిన్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్లతో పాటు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 80W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. రియల్ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ IP66,IP68 మరియు EP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo