Amazon Great Indian Festival Sale డేట్ మరియు ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Amazon Great Indian Festival Sale కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గుడ్ న్యూస్

సేల్ డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ సైతం వెల్లడించింది

దసరా మరియు దీపావళి కోసం అమెజాన్ తీసుకొస్తున్న బిగ్ సేల్

Amazon Great Indian Festival Sale డేట్ మరియు ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Amazon Great Indian Festival Sale కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఈరోజు అమెజాన్ ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ సైతం వెల్లడించింది. దసరా మరియు దీపావళి కోసం అమెజాన్ తీసుకొస్తున్న ఈ అప్ బిగ్ సేల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Great Indian Festival Sale ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 24 గంటల ముందే ఈ సేల్ యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్రైమ్ మెంబర్స్ కి సెప్టెంబర్ 22వ తేదీ నుండే ఈ సేల్ ప్రారంభం అవుతుంది. SBI బ్యాంక్ అమెజాన్ సేల్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ సేల్ నుంచి వస్తువులను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Great Indian Festival Sale 2025

Amazon Great Indian Festival Sale ఆఫర్స్ ఏమిటి?

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ పై 405 వరకు డిస్కౌంట్, కిచెన్ అండ్ అవుట్ డోర్స్ పై 80% వరకు డిస్కౌంట్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససరీస్ పై గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఇదే కాదు స్మార్ట్ టీవీలు మరియు ప్రొజెక్టర్ పై ఏకంగా 65% భారీ డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Also Read: Flipkart The Big Billion Days సేల్ డేట్ అనౌన్స్ చేసింది: Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్.!

స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ కోసం అమెజాన్ ఇండియా ఇప్పటి నుండే భారీగా టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న డీల్స్ తో ప్రత్యేకమైన పేజీ కూడా అందించింది. ఇందులో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అందించింది. ఇందులో నుంచి శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్, వన్ ప్లస్ 13s మరియు ఐకూ 13 వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo