Alcatel V3 Pro 5G: ఈరోజు నుంచి మొదలైన ఆల్కాటెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్.!

HIGHLIGHTS

ఫ్రెంచ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఆల్కాటెల్ విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్

Alcatel V3 Pro 5G ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల ధరలో పేపర్ లాంటి స్క్రీన్ తో వస్తుంది

ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయలకే లభిస్తుంది

Alcatel V3 Pro 5G: ఫ్రెంచ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఆల్కాటెల్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అల్కాటెల్ వి3 ప్రో ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల ధరలో పేపర్ లాంటి స్క్రీన్ తో వస్తుంది మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Alcatel V3 Pro 5G: ప్రైస్

అల్కాటెల్ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 రూపాయల ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB మరియు 256GB వేరియంట్ ను ఈ ధరతో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ను పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ అందుకునే అవకాశం కంపెనీ అందించింది.

ఈ ఫోన్ ను ICICI, Axis, SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్ తో లేదా పాత ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయలకే లభిస్తుంది.

Also Read: అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 10 వేల బడ్జెట్ లోనే లభిస్తున్న 5.2 Dolby Soundbar

Alcatel V3 Pro 5G: ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ సెగ్మెంట్ ధరలో వచ్చిన మొదటి పేపర్ స్టైల్ Next Paper ఫోన్ మరియు ఈ ఫోన్ పేపర్ లాంటి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 570 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ అల్కాటెల్ బడ్జెట్ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 10 GB అదనపు మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP మరియు 5MP దుస్ల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5200 mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అల్కాటెల్ ఈ ఫోన్ ను IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :