Alcatel V3 Pro 5G: ఫ్రెంచ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఆల్కాటెల్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అల్కాటెల్ వి3 ప్రో ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల ధరలో పేపర్ లాంటి స్క్రీన్ తో వస్తుంది మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
Alcatel V3 Pro 5G: ప్రైస్
అల్కాటెల్ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 రూపాయల ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB మరియు 256GB వేరియంట్ ను ఈ ధరతో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ను పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ అందుకునే అవకాశం కంపెనీ అందించింది.
ఈ ఫోన్ ను ICICI, Axis, SBI మరియు HDFC బ్యాంక్ కార్డ్ తో లేదా పాత ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయలకే లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ సెగ్మెంట్ ధరలో వచ్చిన మొదటి పేపర్ స్టైల్ Next Paper ఫోన్ మరియు ఈ ఫోన్ పేపర్ లాంటి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 570 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ అల్కాటెల్ బడ్జెట్ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 10 GB అదనపు మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మరియు 5MP దుస్ల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5200 mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అల్కాటెల్ ఈ ఫోన్ ను IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా అందించింది.