అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ఇటీవలే ఇండియాలో లాంచ్ చేయబడింది మరియు ఈరోజు అన్ని ఆఫర్లతో కలిపి 10 వేల బడ్జెట్ ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వచ్చినా కంప్లీట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అమెజాన్ ఈరోజు ప్రకటించిన ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
5.2 Dolby Soundbar : డీల్
GOVO ఇటీవల ఇండియాలో అందించిన సౌండ్ బార్ GOSURROUND 999 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ శుక్రవారం రూ. 13,999 రూపాయల ధరతో సేల్ అవ్వగా ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ ధర రూ. 2,000 తగ్గించి రూ. 11,999 రూపాయల ధరకే లిస్ట్ చేసింది.
కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను Canara మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
గోవో యొక్క ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 660W సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్డ్ సబ్ ఉఫర్ లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ డిజైన్ మరియు అందమైన రూపంలో ఉంటుంది.
ఈ గోవో 660W సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ కలిగి వుంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ను క్లియర్ వాయిస్ ను ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ అబ్రా అమెజాన్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది.