Amazon GIF 2025 Sale అర్లీ డీల్స్ అనౌన్స్: ఈ 5G ఫోన్స్ చవక ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

Amazon GIF 2025 Sale అర్లీ డీల్స్ అనౌన్స్ చేసింది

ఈరోజు టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ మరియు సేల్ వివరాల పైన ఒక లుక్కేయండి

Amazon GIF 2025 Sale అర్లీ డీల్స్ అనౌన్స్: ఈ 5G ఫోన్స్ చవక ధరలో లభిస్తున్నాయి.!

Amazon GIF 2025 Sale యొక్క ముందస్తు డీల్స్ ను ఈరోజు అమెజాన్ ఇండియా రివీల్ చేసింది. ఈరోజు మూడు టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన అర్లీ డీల్స్ తో మూడు లేటెస్ట్ 5G ఫోన్స్ చాలా చవక ధరలో లభిస్తున్నాయి. అమెజాన్ అందించిన ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ మరియు సేల్ వివరాల పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF 2025 Sale అర్లీ డీల్స్ ఏమిటి?

అమెజాన్ ఇండియా ఈరోజు అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఆర్లీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఇందులో OnePlus Nord CE 4 5G ఫోన్ మరియు iQOO Z10 Lite 5G రెండు స్మార్ట్ ఫోన్ డీల్స్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఇప్పుడు అమెజాన్ సేల్ ఆఫర్ ధరతో లభిస్తున్నాయి. ఏ రెండు డీల్స్ ఏమిటో చూద్దామా.

Amazon GIF 2025 Sale

OnePlus Nord CE 4 5G

ఇది వన్ ప్లస్ నార్డ్ సిరీస్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా చాలా కాలంగా మార్కెట్లో కొనసాగుతోంది. ఈ ఫోన్ ను ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి మంచి డిస్కౌంట్ ధరతో అమెజాన్ సేల్ చేస్తోంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో రూ. 19,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అమెజాన్ ఆఫర్స్ తో ఈ వన్ ప్లస్ ఫోన్ కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో Snapdragon 7 Gen 3 చిప్ సెట్, 100W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 5500 mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా మరియు 8GB అదనపు ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Flipkart BBD Sale భారీ డీల్: 5 వేలకే 500W 5.1 Soundbar అందుకోండి.!

iQOO Z10 Lite 5G

ఇది ఐకూ Z10 సిరీస్ లో అత్యంత చవకైన ఫోన్ మరియు ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి మరింత చవక ధరకు లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 9,998 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ను SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 999 అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 8999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 4 లక్షల 33 వేల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6000 mAh బిగ్ బ్యాటరీ, IP64 రేటెడ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo