మీరు ఏమి చేయకుండా మీ ఫోన్ కొత్త సెట్టింగ్స్ తో కనిపిస్తోందా.. కారణం తెలుసుకోండి.!
షడన్ గా మీ ఫోన్ కొత్తగా కనిపించడం మీరు గమనించారా
మీరు కాల్ చేసినా లేక ఎవరి నుండైనా ఇన్ కమింగ్ కాల్ పొందినా కూడా కొత్తగా కనిపిస్తుంది
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కొత్త డయల్ ప్యాడ్ తో కొత్తగా కనిపించడం మొదలుపెట్టాయి
షడన్ గా మీ ఫోన్ కొత్తగా కనిపించడం మొదలు పెట్టిందా? ఆ,అంటే, మీరు కాల్ చేసినా లేక ఎవరి నుండైనా ఇన్ కమింగ్ కాల్ పొందినా కూడా కొత్తగా కనిపిస్తుంది కదా. మీరు ఎలాంటి అప్డేట్ చేయకుండా మీ ఫోన్ లో మార్పులు జరిగినట్లు చూసి మీరు కంగారు పడి సెట్టింగ్స్ అన్ని వెతికేసి కూడా ఉంటారు. కానీ, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇందులో మీరు చేసిన తప్పు ఏమీ లేదు. గూగుల్ కొత్తగా తెచ్చిన డయల్ ప్యాడ్ అప్డేట్ తో ఈ కొత్త మార్పు జరిగింది. గూగుల్ ‘అందించిన రీసెంట్ అప్డేట్ తో ఇది ఆటోమేటిక్ గా మీ ఫోన్ డైల్ ప్యాడ్ లో మార్పు తెచ్చింది.
Surveyదీనికి కారణం ఏమిటి?
రీసెంట్ గా గూగుల్ యొక్క డిఫాల్ట్ డయల్ ప్యాడ్ యాప్ “Phone by Google” కోసం కొత్త అప్డేట్ అందించింది. ఈ కొత్త అప్డేట్ తో డీఫాల్ట్ గా అప్డేట్ అయ్యింది మరియు ఈ అప్డేట్ తో చాలా కాలంగా యూజర్లకు అలవాటైన డయల్ ప్యాడ్ కొత్త రూపు సంతరించుకుంది. ఇది గూగుల్ డిఫాల్ట్ యాప్ కాబట్టి దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఉంటుంది. అందుకే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు చూడని ఒక కొత్త డయల్ ప్యాడ్ తో కొత్తగా కనిపించడం మొదలుపెట్టాయి.
ఈ కొత్త అప్డేట్ తో లాభం ఏమిటి?
గూగుల్ ఈ కొత్త అప్డేట్ ను మెటీరియల్ 2 ఎక్స్ప్రెసివ్ రీడిజైన్ తో అందించింది. ఇది లేటెస్ట్ పిక్సెల్స్ ఫోన్ మొదలుకొని అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో రిలీజ్ చేసింది మరియు ఇప్పటికే అందుబాటులో కూడా వచ్చింది. కొత్త అప్డేట్ తో డయల్ ప్యాడ్ మరియు కాలింగ్ ఇంటర్ఫేజ్ కొత్త స్టైల్ లోకి మారింది. ఇది పెద్ద రౌండ్ ఎలిమెంట్, ఆకట్టుకునే కొత్త యానిమేషన్ మరియు కొత్త రంగులో కనిపిస్తుంది.

ఇందులో ముందుగా ఉన్న ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ స్థానంలో సెంటర్ ఫోకస్ డెడికేటెడ్ ట్యాబ్ కలిగి ఉంటుంది. అలాగే, ఫెవరేట్ అండ్ రీసెంట్స్ హోమ్ బటన్ లో చేర్చబడ్డాయి. ఇదే కాదు ఇన్ కమింగ్ కాల్ జెశ్చర్ ఇప్పుడు స్వీప్ మరియు టాప్ ఆప్షన్ తో అందించింది. వాస్తవానికి, డిడ్ చూడటానికి ఆకట్టుకునేలా అందించింది. కానీ పాత డయల్ ప్యాడ్ చాలా రోజులుగా చూసి, చూసి అలవాటైపోయిన వారికి ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పాత డయల్ ప్యాడ్ ను మీరు ఈజీగా తిరిగి తెచ్చుకోవచ్చు. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడవచ్చు.
Also Read: Vivo T4 Pro జబర్దస్త్ Sony కెమెరా సిస్టం తో లాంచ్ అవుతోంది.!
పాత డయల్ ప్యాడ్ ఇలా సెట్ చేసుకోండి?
- ముందు మీ ఫోన్ ‘Settings’ లోకి వెళ్ళండి.
- యాప్స్ బటన్ ఎంచుకోండి
- తర్వాత ‘All Apps’ లేదా ‘Manage Apps’ ఎంచుకోండి
- ‘Phone by Google’ కోసం సెర్చ్ చేయండి (ఇది Phone లేదా Dialer అని కనిపిస్తుంది)
- పైన కనిపించే హ్యాంబర్గ్ లేదా మూడు చుక్కలు(3డాట్స్) పై నొక్కండి
- ఇక్కడ కనిపించే ‘Uninstall updates’ పై నొక్కండి.
ఇలా చేయగానే కొత్త అప్డేట్ డిలీట్ అయిపోతుంది. అంతే, మీ పాత డయల్ ప్యాడ్ యథావిధిగా మీకు కనిపిస్తుంది.