Medical AI: వైద్య రంగంలో అద్భుత ఫలితాల కోసం AI ముందడుగు.!
వైద్య రంగంలో అద్భుత ఫలితాల కోసం AI ముందడుగు వేస్తోంది
డికల్ రంగంలో Medical AI ఇప్పుడు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది
మెడికల్ రంగంలో చాలా ఫీచర్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి
Medical AI: వైద్య రంగంలో అద్భుత ఫలితాల కోసం AI ముందడుగు వేస్తోంది. మాన్యువల్ డీటైల్స్ తో నెమ్మదిగా కొనసాగే మెడికల్ రంగంలో AI ఇప్పుడు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది మరియు మరిన్ని అద్భుతాలు చేసే దిశగా దూసుకుపోతోంది. అందుకే, మెడికల్ రంగంలో AI ఉపయోగాలు, ప్రాధాన్యత మరియు కొత్త టెక్ గురించి ఈరోజు విశదీకరించి చెబుతున్నాము.
SurveyMedical AI: మెడికల్ రంగంలో AI ఎలా ముఖ్య పాత్ర వహిస్తుంది?
మెడికల్ రంగంలో AI చొరవ తీసుకోవడం మంచి విషయం అని చెప్పవచ్చు. ఒక రోగి యొక్క రోగ నిర్ధారణ కోసం సాధారణ పద్ధతిలో ఎక్స్ రే, MRI స్కాన్, CT స్కాన్, పాథాలజీ వంటి రిపోర్టులు మాన్యువల్ గా పరిశీలించడం వంటివి చాలా సమయం తీసుకుంటుంది. అయితే, ఇదే రిపోర్ట్ ను AI నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా పరిశీలించి పూర్తి పరిష్కారాన్ని మంచి ఖచ్చితత్వంతో అందిస్తుంది. ఇది రోగి యొక్క రోగం ముదరక ముందే తగిన వైద్యం చేయడానికి సులభమైన మార్గం కూడా చూపిస్తుంది.
మెడికల్ రంగంలో AI వేగంగా విస్తరిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన రోజు ఇన్స్టాంట్ గా రోగి యొక్క వ్యాధి మరియు దానికి తగిన ట్రీట్మెంట్ వంటి వివరాలను అందిస్తుంది. అయితే, ఇది ఇంకా ప్రాథమిక దశలోనే కొనసాగుతోంది. మెడికల్ రంగంలో తప్పు జరగడానికి ఆస్కారం ఉండకూడదు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.
మెడికల్ రంగంలో లేటెస్ట్ AI ఫీచర్స్ ఏమిటి?
మెడికల్ రంగంలో చాలా ఫీచర్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, డీప్ లెర్నింగ్ (Deep Learning) ఆల్గోరిథమ్స్ గొప్ప ఉపయోగపడుతున్నాయి. ఇది మానవజాతికి అత్యంత ప్రమాదకరమైన రోగాలు గా పరిగణించే క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు మరియు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను వేగంగా మరియు ముందుగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు, వ్యక్తి యొక్క రెగ్యులర్ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో వచ్చే వ్యాధులు సైతం ముందుగానే అంచనా వేసే అవకాశం AI ద్వారా అందుబాటులోకి వచ్చింది.

అంతెందుకు మనం రోజు ధరించే స్మార్ట్ వాచ్, స్మార్ట్ రింగ్ మరియు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా AI మన ఫ్యూచర్ వ్యాధి నిర్ధారణ చేసే స్థాయికి చేరుకుంది. హెల్త్ కోసం ప్రజలు ఉపయోగించే స్మార్ట్ పరికరాల అందించే వివరాలు పరిశీలించి తగిన సలహాలు మరియు సూచనలు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందిస్తుంది.
హాస్పిటల్ లో AI వినియోగం ఏమిటి?
ముందుగా అమెరికాలో మెడికల్ AI వినియోగం అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ డీప్ మైండ్ మరియు IBM వాట్సన్ వంటి AI ప్లాట్ ఫామ్ లు ఇప్పటికే అమెరికా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ 19 సమయంలో AI ఆధారిత CT స్కాన్ విశ్లేషణతో చైనా చాలా వేగంగా రోగులను గుర్తించి తగిన వైద్యం అందించింది. మనదేశంలో కూడా అపోలో మరియు ఫోర్టిస్ వంటి ప్రముఖ హాస్పిటల్స్ లో AI టూల్స్ ఉపయోగించి షుగర్ వ్యాధి (డయాబెటిస్) మరియు కచ్చితమైన క్యాన్సర్ నిర్ధారణ నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Medical AI ముందున్న సవాళ్లు ఏమిటి?
పైన చెప్పినట్లు, పేషంట్ రిపోర్ట్ లో లేదా వైద్యంలో చేసే చిన్న తప్పు కూడా వారి ప్రాణానికి ముప్పు కలిగించవచ్చు. ఒకవేళ AI అంచనాలో ఏదైనా తప్పిదాలు లేదా సాఫ్ట్ వేర్ గ్లిచ్ తో తప్పిదాలు జరిగితే రోగికి ముప్పు వాటిల్లే అవకాశం. మరో ప్రధాన సమస్య “డేటా ప్రైవసీ”. పూర్తి హిస్టరీ తో ఉండే పేషంట్స్ డేటా కనుక లీక్ అయితే వారి రోగం మాట అటుంచితే ఫైనాన్షియల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. డాక్టర్ మరియు మెడికల్ స్టాఫ్ కి సరైన AI టూల్స్ అవగాహన అందించడం కూడా అవసరం.
Also Read: అండర్ రూ. 3,500 ధరలో లభించే Best Soundbar గురించి తెలుసా.!
మెడికల్ AI సరైన ఉపయోగం ఏమిటి?
రోగ నిర్ధారణ మరియు ట్రీట్మెంట్ లో డాక్టర్ కి సరైన సహాయకారిగా AI కొనసాగుతుంది. అంతేకాదు, తప్పు జరగడానికి వీలు లేకుండా AI తో నడిచే డిజిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లను నెలకొల్పే అవకాశం ఉంటుంది. అయితే, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి అవగాహన కలిగిన నిపుణుల పర్యవేక్షణలో జరగడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
అయితే, మెడికల్ రంగంలో పూర్తి స్థాయి AI చొరబాటుకు ఇంకా సమయం పడుతుందని నిపుణులు ఊహిస్తున్నారు.