Oppo Reno11 Series: 32MP టెలీఫోటో పోర్ట్రైట్ కెమేరా తో వస్తోంది.!

Oppo Reno11 Series: 32MP టెలీఫోటో పోర్ట్రైట్ కెమేరా తో వస్తోంది.!
HIGHLIGHTS

భారత మార్కెట్ లో Oppo Reno11 Series విడుదల అనౌన్స్ చేసింది

ఒప్పో, ఈ ఫోన్స్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు

ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను 'Launching Soon' బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది

Oppo Reno11 Series భారత మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మొదలుపెట్టిన ఒప్పో, ఈ ఫోన్స్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. ఈ ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ‘Launching Soon’ బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కెమేరా ప్రత్యేకంగా తీసుకు వస్తున్నట్లు మరియు మరిన్ని ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందించే అవకాశం కూడా ఉండవచ్చు.

Oppo Reno11 Series Launch

ఒప్పో రెనో11 సిరీస్ ను The Portrait Expert క్యాప్షన్ తో ఒప్పో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుందని అర్ధమవుతోంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతోంది. ఈ ఫోన్ టీజింగ్ లో భాగంగా ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ అందించింది.

Oppo Reno11 Series Launch

ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుందని అర్ధం అవుతోంది. ఈ పేజ్ ద్వారా ఒప్పో అందించిన ఈ అప్ కమింగ్ స్పెక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Dolby Atmos Sound bar పైన అమేజాన్ ధమాకా ఆఫర్.!

ఒప్పో రెనో11 సిరీస్ టీజ్డ్ స్పెక్స్

ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 50MP OIS మెయిన్ + 32 MP అల్ట్రా వైడ్ + 32 MP అల్ట్రా క్లియర్ కెమేరా (Sony IMX709) ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ తో చిత్రికరించినట్లు చెబూతూన్న కొన్ని శాంపిల్ ఫోటోలను కూడా ఫోన్ లాంచ్ టీజర్ పేజ్ నుండి షేర్ చేసింది ఒప్పో.

ఈ ఫోటోలను చూస్తుంటే ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను మంచి కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఇమేజెస్ ద్వారా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్, కర్వ్డ్ డిస్ప్లే మరియు పంచ్ హోల్ డిజైన్ తో సెల్ఫీ కెమేరా సెటప్ ను కలిగి ఉన్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫోన్ లలో 80W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo