OpenAI: ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.!

HIGHLIGHTS

ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త ఒరవడి సృష్టించింది ఓపెన్ ఎఐ చాట్ జిపిటి

ఈ ఫీచర్ ఇప్పుడు చాట్ జిపిటి యాప్ యూజర్స్ అందరికి అందించింది

OpenAI: ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.!

OpenAI: ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త ఒరవడి సృష్టించింది ఓపెన్ ఎఐ చాట్ జిపిటి. కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే కాకుండా అందరికి అందుబాటులోకి వచ్చిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రీమియం యూజర్లకు మరిన్ని ఫీచర్స్ ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఇప్పుడు యూజర్స్ అందరికి ఒక కూడా ఒక ప్రీమియం ఫీచర్ ను అందుబబాటులోకి తీసుకు వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OpenAI: ChatGPT

ఓపెన్ ఎఐ చాట్ జిపిటి యాప్ లో ముందుగా ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న వాయిస్ సపోర్ట్ ఇప్పుడు అందరికీ అందివచ్చింది. అంటే, ఇప్పుడు ప్రతి యూజర్ కూడా చాట్ జిపిటి యాప్ వాయిస్ ను ఉచితంగానే ఆనందించవవచ్చు. ఈ ఫీచర్ తో టెక్స్ట్ కి బదులుగా రెస్పాన్స్ మరియు ఇంటరాక్షన్ కోసం వాయిస్ ను ఉపయోగించవచ్చు.

ఈ ఫీచర్ చాట్ జిపిటి యాప్ లో టెక్స్ట్ బార్ కి ప్రక్కన ఉంటుంది. దీని ఉపయోగించడానికి అక్కడ కనిపించే హెడ్ ఫోన్ సింబర్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వాస్తవానికి, ఈ వాయిస్ ఫీచర్ కేవలం ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కి మాత్రమే అందుబాటులో వుంది. అయితే, ఈ ఫీచర్ ఇప్పుడు చాట్ జిపిటి యాప్ యూజర్స్ అందరికి అందించింది.

OpenAI ChatGPT
జిపిటి వాయిస్

ప్రస్తుతం చాట్ జిపిటి వాయిస్ మొత్తం 5 రకాలైన గొంతులతో వాయిస్ అందిస్తోంది. అందులో, బ్రీజ్, ఎంబర్, జూనిపర్, స్కై మరియు కోవ్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వాయిస్ ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఇంటరాక్షన్ ను ఆ వాయిస్ లో రిసీవ్ చేసుకోవచ్చు. మీరు కూడా చాట్ జిపిటి ఫ్రీ వెర్షన్ యూజర్ అయితే, ఈ కొత్త ఫీచర్ ను మీ స్మార్ట్ ఫోన్ లో అందించవచ్చు.

Also Read : Amazon Big Deal: లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన రూ.2,000 కూపన్ డిస్కౌంట్ అందుకోండి.!

అయితే, చాట్ జిపిటి యొక్క కంప్లీట్ ఫీచర్స్ ను అందించాలంటే మాత్రం నెలకు 20 డాలర్స్ ను కర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లింపుతో చాట్ జిపిటి-4 టర్బో యాక్సెస్ ను అందుకుంటారు. ఇది మరింత యాక్యురేట్ గా ఉండడమే కాకుండా మరిన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగ లాభాలను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo