Redmi Note 16 Pro: భారీ ఆఫర్స్ తో మొదలైన రెడ్‌మి కొత్త ఫోన్ సేల్.!

HIGHLIGHTS

రెడ్‌మి నోట్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయ్యింది

నోట్ 16 స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది

200MP AI కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అందించింది

Redmi Note 16 Pro: భారీ ఆఫర్స్ తో మొదలైన రెడ్‌మి కొత్త ఫోన్ సేల్.!

Redmi Note 16 Pro: షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన రెడ్‌మి నోట్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సిరీస్ నుంచి అందించిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన నోట్ 16 స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. 200MP AI కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ను రెడ్‌మి అందించింది. ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 15 Pro : ప్రైస్

రెడ్‌మి ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టార్టింగ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 29,999 ధరతో మరియు ఈ ఫోన్ రెండవ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 31,999 ప్రైస్ తో అందించింది. రెడ్‌మి నోట్ 15 ప్రో ఫోన్ కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్ మరియు మిరాజ్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా రెడ్‌మి అందించింది. ICICI మరియు HDFC క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పై రెడ్‌మి అందించింది. ఇదే కాదు ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందించింది.

Also Read: Super Deal: కేవలం రూ. 16,499 రేటుకే ఫ్రేమ్ లెస్ 4K QLED Smart Tv అందుకోండి.!

Redmi Note 15 Pro : ఫీచర్స్

రెడ్‌మి నోట్ 15 ప్రో 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు డాల్బీ విజన్ తో పాటు HDR10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంటే, ఇది గేమింగ్ మరియు కంటెంట్ కోసం కూడా బాగా అనువైన డిస్ప్లే అవుతుంది. ఈ కొత్త ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 Ultra (4nm) ప్రొసెసర్ తో రెడ్‌మి అందించింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.

Redmi Note 15 Pro Sale

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, 200 MP మెయిన్ కెమెరా జతగా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఇదే కాదు ఈ ఫోన్ ముందు భాగంలో 20 MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 6580 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP66, 68, 69 మరియు 69K రేటింగ్ తో ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ Hi Res ఆడియో మరియు డాల్బీ అట్మాస్ వంటి గొప్ప ప్రీమియం ఆడియో ఫీచర్స్ ను డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo