ChatGPT Down: ప్రముఖ AI చాట్‌బాట్ సర్వీస్ లో అంతరాయం.. యూజర్ల నిట్టూర్పు.!

HIGHLIGHTS

ChatGPT Down వేల కొద్దీ యూజర్లు డౌన్ డిక్టేటర్ ప్లాట్ ఫామ్ నుంచి రిపోర్ట్ చేశారు

ప్రముఖ AI చాట్‌ బాట్ సర్వీస్ లో అంతరాయం ఏర్పడినట్టు భారీగా రిపోర్ట్

ఇది ఇప్పటి వరకు వచ్చిన అవుటేజ్ లో ఒకటిగా చెబుతున్నారు

ChatGPT Down: ప్రముఖ AI చాట్‌బాట్ సర్వీస్ లో అంతరాయం.. యూజర్ల నిట్టూర్పు.!

ChatGPT Down: ప్రముఖ AI చాట్‌బాట్ సర్వీస్ లో అంతరాయం ఏర్పడినట్టు వేలకొద్దీ యూజర్లు డౌన్ డిక్టేటర్ ప్లాట్ ఫామ్ నుంచి రిపోర్ట్ చేశారు. అయితే, ఈ సర్వీస్ అంతరాయం కలిగింది మన దేశంలో కాదనుకోండి. US లో చాట్‌జిపిటి సర్వీస్ లో అంతరాయం కలిగింది. అమెరికాలో పెద్ద మొత్తంలో అవుటేజ్ (సర్వీస్ అంతరాయం) కారణంగా వేల మంది వినియోగదారులు సేవను ఉపయోగించలేకపోయారు. ఇది ఇప్పటి వరకు వచ్చిన పెద్ద అవుటేజ్ లో ఒకటిగా చెబుతున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ChatGPT Down:

సైట్ లో కలిగే సర్వీస్ అంతరాయం కోసం రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్న డౌన్ డిక్టేటర్ ప్లాట్ ఫామ్ వంటి చాలా అవుటేజ్ ట్రాకింగ్ సైట్ల నుండి సేకరించిన డేటా ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ డేటా ప్రకారం, 3 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం నుంచి సుమారు 13,000 పైగా యూజర్లు అమెరికాలో చాట్‌జిపిటి లో తలెత్తిన సర్వీస్ సమస్యలను రిపోర్ట్ చేశారు. బ్యాక్‌ ఎండ్‌ సమస్యల వల్ల మెసేజెస్ పంపలేకపోవడం, రిప్లై ఎర్రర్ మరియు లాగిన్ ఫెయిల్ లాంటి ఇతర సమస్యలు ఎదురైనట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.

యూజర్లు చూసిన ప్రధాన సమస్యలు?

ఈ సర్వీస్ ను ఉపయోగించుకునే యూజర్లు వెబ్సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ వంటి అన్ని ఫార్మాట్లలో ఈ సర్వీస్ అందుబాటులో లేకపోవడం గురించి మధ్యాహ్నం నుంచి రిపోర్ట్ పెరిగాయి. చాట్ కన్వర్జేషన్, సెర్చ్, ఇమేజ్ జనరేషన్, Codex వంటి OpenAI సర్వీస్ మీద కూడా కొంత ప్రభావం కనిపించినట్లు చెబుతున్నారు.

ఓపెన్ ఎఐ స్పందన ఏమిటి?

ఈ అవుటేజ్ గురించి ఓపెన్ ఎఐ కూడా చక్కగా స్పందించింది. ఈ విషయం గురించి స్పందిస్తూ, ఈ అవుటేజ్ విషయాన్ని తమ స్టేటస్ పేజీ ద్వారా అంగీకరించింది. కేవలం స్పందించడం మాత్రమే కాదు ఇది ఎక్కువ స్థాయిలో Error Rate కలిగిన అవుటేజ్ గా కూడా ప్రకటించింది.

ChatGPT Down in US

అయితే, ఈ అవుటేజ్ సమస్య అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించింది. భారతదేశంలోని యూజర్లు ఈ అవుటేజ్ సమస్యలు చూసిన దాఖలాలు లేవు. అంతేకాదు, కొత్త కోడెక్స్ సర్వీస్ తో సహా ఓపెన్ ఎఐ అన్ని ప్లాట్ ఫ్యాన్స్ కూడా ఇండియాలో మంచి ఉపయోగంలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

Also Read: Redmi Note 16 Pro: భారీ ఆఫర్స్ తో మొదలైన రెడ్‌మి కొత్త ఫోన్ సేల్.!

ఈ అవుటేజ్ ప్రభావం ఏమిటి?

పూర్తిగా చాట్‌జిపిటి వంటి AI చాట్ బాట్ పై ఆధారపడిన వారికి ఇది పెద్ద సమస్య అవుతుంది. అంటే, సొంత సృజనాత్మకత లేకుండా పూర్తిగా ఎఐ సహాయంతో పనులు చేసే వారు మొదలుకొని అధిక ప్రొడక్టివిటీ వంటి వాటి కోసం పూర్తిగా ఎఐ ఆధారపడిన వారికి పెద్ద సమస్య అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo