మీ ఆధార్ ఏ బ్యాంక్ లకు లింక్ అయ్యిందో ఎలా చెక్ చెయ్యాలి?

మీ ఆధార్ ఏ బ్యాంక్ లకు లింక్ అయ్యిందో ఎలా చెక్ చెయ్యాలి?
HIGHLIGHTS

భారతదేశంలో అన్నింటికన్నా ముఖ్యమైన పత్రాలలో ఆధార్ ఒకటి

ఆధార్ కి సంబంధించిన వివరాలు అన్ని కూడా చాలా క్లియర్ గా ఉండాలి

ఆధార్ లో లింక్ అయిన అన్ని బ్యాంక్ వివరాలు చూడవచ్చు

భారతదేశంలో అన్నింటికన్నా ముఖ్యమైన పత్రాలలో ఆధార్ ఒకటి. అందుకే, ఆధార్ కి సంబంధించిన వివరాలు అన్ని కూడా చాలా క్లియర్ గా ఉండాలి. అయితే, చాలా ఫోన్ నంబర్లు మరియు బ్యాంక్ అకౌంట్స్ ఉన్న కారణంగా కొంత మంది ఏ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లో ఉన్న మొబైల్ నంబర్ తో లింక్ చేశాము అనే సందేహంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. అయితే, ఈరోజు ఇక్కడ మీ మీ ఆధార్ ఏ బ్యాంక్ లకు లింక్ అయ్యిందనే విషయాన్ని ఆన్లైన్లో ఎలా చెక్ చెయ్యాలో తెలుసుకుందాం.

మీ ఆధార్ – బ్యాంక్ లింక్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

ముందుగా www.uidai.gov.in వెబ్సైట్ ను సందర్శించాలి. ఈ వెబ్సైట్ లో మొదటి అప్షన్ My Aadhar లోనికి వెళ్ళి 'Check Your Aadhaar and Bank Account' అనే అప్షన్ ను ఎంచుకోవాలి. ఈ అప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు. ఈ పేజ్ లో అడిగిన వద్ద మీ ఆధార్ నంబర్ ను మరియు ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చెయ్యాలి.

తరువాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఈ OTPని UIDAI వెబ్‌సైట్‌లో నమోదు చెయ్యాలి. ఈ స్టెప్ తరువాత మీరు లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంటే, మీరు లాగిన్ అయినప్పుడు మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మీ బ్యాంక్ ఖాతా వివరాలన్నీకూడా అక్కడ చూడవచ్చు. ఈ విధంగా మీ ఆధార్ తో లింక్ చెయ్యబడిన అన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు ఇంట్లో కూర్చోని ఆన్లైన్లో చాలా సులభంగా తెల్సుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo