మీ Aadhaar Pan Link చెయ్యలేదా .. మీ బ్యాంక్ అకౌంట్ నిలిచిపోతుంది.!
PANమరియు ఆధార్ Aadhaar లింక్ కోసం చివరి తేదీ దగ్గర పడింది
Aadhaar Pan Link చేయని ప్రతి ఒక్కరి పాన్ కార్డు ను హోల్డ్ చేయాలనీ సూచన
ఆధార్ మరియు పాన్ కార్డును లింక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది
దేశ ప్రజల రక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు పాన్ (PAN) మరియు ఆధార్ (Aadhaar) ను లింక్ చేయాలి, అని సూచించింది. అంతేకాదు, Aadhaar Pan Link చేయని ప్రతి ఒక్కరి పాన్ కార్డు ను హోల్డ్ చేయాలనీ మరియు ఆ కార్డ్ తో ఎటువంటి లావాదేవీలు జరపడానికి వేలు లేకుండా చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ మరోయు పాన్ లింక్ కోసం 31 డిసెంబర్ 2025 తేదీని లాస్ట్ డేట్ గా అనౌన్స్ చేసింది. అందుకే, ఇప్పుడు ఈ లింక్ చేర్య నిర్వహించని అందరూ ఆన్‌లైన్ లో ఆదాయం పన్ను విభాగం (Income Tax Department) అధికారిక సెక్షన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు.
SurveyAadhaar Pan Link : ఎప్పటి వరకు చేయాలి?
పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా విధిగా వారి ఆధార్ మరియు పాన్ కార్డును లింక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ పని చేయడానికి ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తగిన సమయం కూడా అందించింది. అయితే, ఇప్పటికీ వారి పాన్ మరియు ఆధార్ లింక్ చేయని వారు చాలా మంది ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, ఈ గడువు ఇప్పుడు చివరి వారం రోజులకు చేరుకుంది. ఈ సౌలభ్యం 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. కొత్త సంవత్సరం నుంచి పాన్ ఆధార్ లింక్ కానీ యూజర్ అకౌంట్ పై ఇది ప్రభావం చూపుతుంది.

Aadhaar Pan Link : ప్రభావం ఏమిటి?
ఒకవేళ మీరు మీ పాన్ ఆధార్ లింక్ చేయకపోతే, మీరు వెంటనే చేసుకోండి. ఎందుకంటే, పాన ఆధార్ లింక్ చేయని యూజర్ల పాన్ అకౌంట్ హోల్డ్ అవుతుంది. అంటే, ఈ యూజర్లు Income tax refund, returns e-filing వంటి సేవలు పొందలేరు. అంతేకాదు, కొన్ని బ్యాంక్ సిరీస్ లలో కూడా మీకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది.
అంటే, వివరంగా చెప్పాలంటే, మీ బ్యాంకు అకౌంట్ ను నేరుగా క్లోజ్ చేయకుండా అమౌంట్ డిపాజిట్, ట్రాన్స్‌ఫర్ మొదలు కొని FD మరియు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వరకు మీ అకౌంట్ ద్వారా చేయడం దాదాపు నిలిపి వేస్తుంది. అయితే, మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ను మాత్రం విత్ డ్రా చేసుకోవడంలో ఎటువంటి అంతరాయం కలిగించదు.
Also Read: Oppo Reno 15 Series: 2026 కొత్త సంవత్సరం కోసం కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
పాన్ ఆధార్ లింక్ (గైడ్)
- ముందుగా వెబ్‌సైట్: www.incometax.gov.in ఓపెన్ చేయాలి
- సైట్ లో “Link Aadhaar” ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి
- PAN, Aadhaar నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
- OTP ద్వారా చేయండి వ్యాలిడేట్ చేయండి.
అంతే, మీ పాన్ ఆధార్ లింక్ కి సంబంధించి మీకు నోటిఫికేషన్ అందిస్తుంది. ఒకవేళ మీరు SMS సర్వీస్ ద్వారా ఈ పని చేయాలనుకుంటే ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి.
SMS ద్వారా లింక్
- Type: UIDPAN AadhaarPAN
- ఉదా: UIDPAN 123456789012 ABCDE1234F
- ఈ SMS ని 567678 లేదా 56161 నెంబర్ కి పంపండి
ఒకవేళ మీరు మీ ఆధార్ పాన్ లింక్ చేయకపోతే, పైన తెలిపిన రెండు పద్ధతుల్లో ఏదైనా ఒక పద్దతి ద్వారా మీ పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు.