Oppo Reno 15 Series: 2026 కొత్త సంవత్సరం కోసం కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
2026 కొత్త సంవత్సరం కోసం ఒప్పో కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది
ఒప్పో కూడా తన Oppo Reno 15 Series అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన టీజర్ పేజీ కూడా అందించింది
Oppo Reno 15 Series : 2026 కొత్త సంవత్సరం కోసం ఒప్పో కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అన్ని కంపెనీలు కూడా వారి కొత్త ఫోన్ కు విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మొబైల్ తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం లాంచ్ చేసే అప్ కమింగ్ ఫోన్స్ అనౌన్స్ చేశాయి. ఇప్పుడు ఒప్పో కూడా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను అనౌన్స్ చేసింది.
SurveyOppo Reno 15 Series: లాంచ్ డేట్?
ఒప్పో రెనో 15 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ 2026 ఆరంభంలో లాంచ్ అవుతుందని మనం ఊహించవచ్చు. ఈ ఫోన్ సిరీస్ కోసం ఒప్పో ఇప్పుడు స్టార్ట్ చేసింది మరియు ఈ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన టీజర్ పేజీ కూడా అందించింది.
Oppo Reno 15 Series: ఫీచర్స్ ఏమిటి?
ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కొన్ని కీలక ఫీచర్స్ సైతం ఒప్పో లంచ్ టీజర్ లో భాగం విడుదల చేసింది. ఈ ఫోన్ ను రిబ్బన్ ఇన్స్పిరేషన్ వ్రాప్స్ కలిగిన బ్యాక్ ఫ్యానల్ డిజైన్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తుంది. ఇందులో రెనో సిగ్నేచర్ ను కూడా ఈసారి జత చేసింది. హోలో ఫ్యూజన్ టెక్నాలాజి కలిగిన మొదటి ఫోను గా ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది.

ఇది మాత్రమే కాదు ఈ సిరీస్ ఫోన్లను కంప్లీట్ గ్లాస్ తో ఒక శిల్పంగా చెక్కిన డిజైన్ అందిస్తున్నట్లు, ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఇది చూడటానికి మాత్రమే ప్రీమియం కాదు చేతిలో కూడా చాలా ప్రీమియం ఫీల్ అందిస్తుందని ఒప్పో వెల్లడించింది.
ఈ ఫోన్ లో వెనుక మెయిన్ కెమెరా డిజైన్ ను కూడా సరికొత్తగా అందించింది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొత్త డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ విషయం కన్ఫర్మ్ చేసింది.
Also Read: Realme Narzo 90x First Sale: కేవలం ఫస్ట్ డే లభించే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!
ఒప్పో రెనో 15 సిరీస్ 5జి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ రెండు ఫోన్ల డిజైన్ లో చాలా మార్పులు ఉన్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు ఈ సిరీస్ కీలక ఫీచర్స్ కూడా త్వరలో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.