Realme Narzo 90x First Sale: కేవలం ఫస్ట్ డే లభించే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!
రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది
ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి అందించిన ఫస్ట్ డే ఓన్లీ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత చవక ధరలో లభిస్తుంది
ఈ ఫస్ట్ డే సేల్ ఆఫర్ కేవలం 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది
Realme Narzo 90x First Sale: ఇండియన్ మార్కెట్లో రియల్‌మీ సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి అందించిన ఫస్ట్ డే ఓన్లీ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత చవక ధరలో లభిస్తుంది. అయితే, ఈ ఫస్ట్ డే సేల్ ఆఫర్ కేవలం 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే, కేవలం ఫస్ట్ డే లభించే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.
SurveyRealme Narzo 90x First Sale: ఆఫర్లు ఏమిటి?
రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై ఈ డీల్ అందించింది. అదేమిటంటే, డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు జరిగే ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల భారీ కూపన్ ఆఫర్ అందించింది. ముందే చెప్పినట్లుగా ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రైస్
ఈ ఫోన్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 13,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 11,999 ధరలో లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) రూ. 15,499 ధరతో వచ్చింది మరియు ఈరోజు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 13,499 ధరలో లభిస్తుంది. ఈ కూపన్ ఆఫర్ ధరలు ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి.
Also Read: Realme 16 Pro Plus కెమెరా ఫీచర్స్ రివీల్ చేసిన రియల్‌మీ.. కళ్ళు చెదిరే కెమెరాతో వస్తోంది.!
Realme Narzo 90x First Sale: ఫీచర్స్
ఈ రియల్‌మీ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ 6.8 ఇంచ్ HD+ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ కోసం తగిన 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ను DT-Star D+ గ్లాస్ రక్షణతో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో వచ్చింది మరియు ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్
ఈ లేటెస్ట్ ఫోన్ 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫోన్ అయినా కూడా AI ఎడిట్ జీనీ మరియు AI ఎడిటర్ వంటి చాలా లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ బడ్జెట్ ఈ ధరలో అందుబాటులో లేని 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.