ChatGPT Down: పూర్తిగా డౌన్ అయిన ఓపెన్ ఎఐ చాట్ బాట్.!
ఓపెన్ ఎఐ చాట్ బాట్ చాట్‌జిపిటి పూర్తిగా డౌన్ అయ్యింది
ఈ విషయాన్ని డౌన్ డిక్టేటర్ సాక్షిగా యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు
ChatGPT Down: ఓపెన్ ఎఐ చాట్ బాట్ చాట్‌జిపిటి పూర్తిగా డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని డౌన్ డిక్టేటర్ సాక్షిగా యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X సాక్షిగా యూజర్లు ఈ విషయాన్ని తనదైన స్టైల్ లో ఎండగడుతూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మెల్లగా మొదలైన ఈ సమస్య 2 గంటల తర్వాత పూర్తి స్థాయిలో డౌన్ అయ్యింది.
ChatGPT Down :
ప్రముఖ క్రౌడ్ సోర్స్ అవుట్టేజ్ మోనిటర్ సర్వీస్ downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చాట్‌జిపిటి డౌన్ అయినట్లు గుర్తించిన యూజర్లు ఈ సైట్ నుంచి రిపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి మొదలైన సమస్య మధ్యాహ్నం 2 గంటల తర్వాత తార స్థాయికి చేరుకున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. డౌన్ డిక్టేటర్ నుంచి చాట్‌జిపిటి డౌన్ గురించి అందుకున్న రిపోర్ట్ లో వెబ్సైట్ డౌన్ గురించి 70శాతం, చాట్‌జిపిటి యాప్ డౌన్ గురించి 24శాతం మరియు API డౌన్ గురించి 7 శాతం రిపోర్ట్ అందుకుంది.
అమెరికా బెస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఎఐ కి చెందిన చాట్‌జిపిటి, Dall-E, డేటా అనలిస్ట్, వెబ్ బ్రౌజర్, రైటింగ్ కోచ్ మరియు మరిన్ని సోర్స్ లు డౌన్ అయినట్లు కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్‌జిపిటి పూర్తిగా మోడీకేయండి గురించి యూజర్లు తమదైన శైలిలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి కూడా చాట్‌జిపిటి ని ఆశ్రయించే యూజర్లు ఎక్కువగా అసహానికి గురైనట్లు ఈ ట్వీట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
చాట్‌జిపిటి వెబ్సైట్ అయితే పూర్తిగా డౌన్ అయ్యింది. చాట్ బాక్స్ లో ఏమి అడిగినా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కేవలం “Hmm…something seems to have gone wrong” అనే మెసేజ్ ను మాత్రమే చూపిస్తోంది. మరి ఈ సమస్య ఎప్పటి వరకు నిర్మూలించ బడుతుందో చూడాలి.
Also Read: Motorola Edge 60: భారీ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా.!
చాట్‌జిపిటి రిస్టోర్ విషయంగా మీకు సమస్య తలెత్తితే ఇది మీ డివైజ్ లో సమస్య కాదని మరియు చాట్‌జిపిటి డౌన్ కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని గమనించాలి. అంతేకాదు, కంపెనీ నుంచి అప్డేట్ వచ్చే వరకు ఈ సమస్య గురించి పూర్తిగా నిజానిజాలు నిర్ధారించలేము.