Motorola Edge 60: భారీ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా.!
భారత మార్కెట్లో మోటోరోలా శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది
మోటోరోలా ఎడ్జ్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో అందించింది
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేసింది
Motorola Edge 60: భారత మార్కెట్లో మోటోరోలా శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈరోజు కూడా మోటోరోలా ఎడ్జ్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను గొప్ప స్లీక్ డిజైన్ పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అయ్యింది. మోటోరోలా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
Motorola Edge 60 : ప్రైస్
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ రూ. 25,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై IDFC మరియు Axis క్రెడిట్ మరియు డెబిట్ కార్డు పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను మోటోరోలా ప్రకటించింది. ఈ ఫోన్ ను పాంటోన్ గిబ్రాల్టర్ సీ మరియు పాంటోన్ షాంరాక్ రెండు రంగుల్లో అందించింది. జూన్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Motorola Edge 60 : ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ ను 8.25mm మందంతో స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ pOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, HDR 10+ సపోర్ట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సూపర్ HD+ 1.5K రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 12 GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించింది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony LYTIA 700C) ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. 30fps తో 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మోటోరోలా అందించిన moto ai ఫీచర్ తో ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Apple లేటెస్ట్ గా ప్రకటించిన iOS 26 అందుకోనున్న ఐఫోన్ లిస్ట్ ఇదే.!
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ MIL – 810H మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను 5500 mAh బ్యాటరీ మరియు ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 68W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ మోటోరోలా కొత్త ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.