కేవలం రూ. 2,499 ధరలో డ్యూయల్ డ్రైవర్ ANC బడ్స్ లాంచ్ చేసిన GOBOULT
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ GOBOULT ఇండియన్ మార్కెట్లో కొత్తగా లాంచ్ చేసింది
కేవలం రూ. 2,499 ధరతో డ్యూయల్ డ్రైవర్ ANC బడ్స్ లాంచ్ చేయడం విశేషం
ఈ బడ్స్ 50dB హైబ్రిడ్ ANC ఫీచర్ మరియు 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో తో వస్తుంది
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ GOBOULT ఇండియన్ మార్కెట్లో కొత్తగా లాంచ్ చేసింది. కేవలం రూ. 2,499 ధరతో డ్యూయల్ డ్రైవర్ ANC బడ్స్ లాంచ్ చేయడం విశేషం. ఈ ఇయర్ బర్డ్స్ గొప్ప డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ తో చాలా చౌక ధరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టాయి.గో బోల్ట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ కంప్లీట్ ఫ్యూచర్స్
తెలుసుకోండి.
SurveyGOBOULT Hybrid ANC: ప్రైస్
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 2,499 ధరతో లాంచ్ చేసింది మరియు ఈ బడ్స్ ను ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ ఇయర్ బడ్స్ ఐవరీ వైట్, ఒడీసియన్ బ్లాక్ మరియు సఫైర్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.
GOBOULT Hybrid ANC: ఫీచర్స్
ఈ ఇయర్ బడ్స్ ను బ్యాగ్ లేదా జేబులో పెట్టుకునేలా మంచి డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ లో రెండు స్పీకర్లు ఉంటాయి. ఇందులో ఒకటి బాస్ అందించే 10mm ఉఫర్ మరియు రెండోది మంచి ట్రెబెల్ అందించే 6mm ట్వీటర్. ఈ సెటప్ తో ఈ కొత్త బడ్స్ మంచి లీనమయ్యే క్రిస్పీ సౌండ్ అందిస్తాయని గో బోల్ట్ తెలిపింది. ఈ బడ్స్ కంపెనీ యొక్క ప్రత్యేకమైన యాప్ సపోర్ట్ తో వస్తుంది మరియు కావాల్సిన విధంగా సౌండ్ ను ట్యూన్ చేసుకునే అవకాశం అందిస్తుంది.

ఇక ఈ బడ్స్ కలిగిన ఇతర ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 50dB హైబ్రిడ్ ANC ఫీచర్ మరియు 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో తో వస్తుంది. ఈ రెండు ఫీచర్స్ తో ఎటువంటి నోయిస్ లేని ప్యూర్ ఆడియో ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఇరాక్ కాలింగ్ విషయానికి వస్తే., ఈ బడ్స్ హెక్సా, అంటే మొత్తం 6 మైక్ సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ENC ఫీచర్ ను కూడా కలిగి గొప్ప కాలింగ్ సౌలభ్యాన్ని ఈ బడ్స్ యూజర్లు అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: గూగుల్ పిక్సెల్ 10a రాకతో Google Pixel 9a పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.4 కనెక్టివిటీ తో లాంచ్ అయ్యింది. ఈ గో బోల్ట్ బడ్స్ SBC AAC కోడ్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ టచ్ కంట్రోల్, IPX5 వాటర్ రెసిస్టెన్స్, AI వాయిస్ అసిస్టెంట్ మరియు డ్యూయల్ పైరింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే టైం అందించే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile