Apple లేటెస్ట్ గా ప్రకటించిన iOS 26 అందుకోనున్న ఐఫోన్ లిస్ట్ ఇదే.!
Apple నిన్న రాత్రి నిర్వహించిన WWDC 2025 ఈవెంట్ నుంచి iOS 26 ను ప్రకటించింది
ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ను లేటెస్ట్ ఫీచర్స్ తో జత చేసింది
ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ను అందుకోనున్న యాపిల్ ఐఫోన్స్ కంప్లీట్ లిస్ట్
భారత కాలమానం ప్రకారం Apple నిన్న రాత్రి నిర్వహించిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) ఈవెంట్ నుంచి iOS 26 ను ప్రకటించింది. ఈ ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ను లేటెస్ట్ ఫీచర్స్ తో జత చేసింది మరియు యూజర్ కు అనుకూలమైన మరియు అవసరమైన మార్పులు మరియు కొత్త ఫీచర్స్ కూడా జత చేసింది. ఈ కొత్త ఐఓఎస్ 26 ను కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో అందించింది. యాపిల్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఐఓఎస్ 26 ను అందుకోనున్న ఐఫోన్ లిస్ట్ ను కూడా యాపిల్ ప్రకటించింది. మరి ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ను అందుకోనున్న యాపిల్ ఐఫోన్స్ కంప్లీట్ లిస్ట్ ఏమిటో చూద్దామా.
Apple iOS 26 : ఫోన్స్ లిస్ట్
యాపిల్ యొక్క 26 ఐఫోన్స్ ఈ కోయ్త్త అప్డేట్ అందుకోవడానికి అర్హత కలిగి ఉన్నట్లు యాపిల్ లిస్ట్ ప్రకటించింది. ఈ ఫోన్స్ ఇక్కడ చూడవచ్చు
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్:
యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 16, యాపిల్ ఐఫోన్ 16 ప్లస్, యాపిల్ ఐఫోన్ 16 మరియు యాపిల్ ఐఫోన్ 16e ఫోన్లు ఈ సిరీస్ లో ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ :
ఈ సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 15 ప్రో, యాపిల్ ఐఫోన్ 15 ప్లస్, యాపిల్ ఐఫోన్ 15 ఫోన్స్ ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ :
యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 14 ప్రో, యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ మరియు యాపిల్ ఐఫోన్ 14 ఫోన్లు ఈ సిరీస్ లో ఉన్నాయి.
Also Read: Apple iOS 26: సరికొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ మరియు AI ఫీచర్స్ తో అనౌన్స్ చేయబడింది.!
యాపిల్ ఐఫోన్ 13 సిరీస్
ఈ సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 13 ప్రో, యాపిల్ ఐఫోన్ 13 మినీ, మరియు యాపిల్ ఐఫోన్ 13 ఫోన్ లు ఉన్నాయి
యాపిల్ ఐఫోన్ 12 సిరీస్
ఇక యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ విషయానికి వస్తే, ఈ సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 12 ప్రో, యాపిల్ ఐఫోన్ 12 మినీ మరియు యాపిల్ ఐఫోన్ 12 ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 11 ప్రో మాక్స్, యాపిల్ ఐఫోన్ 11 ప్రో, యాపిల్ ఐఫోన్ 11 మరియు యాపిల్ ఐఫోన్ SE (సెకండ్ జనరేషన్ మరియు అంతకంటే పైన) ఫోన్ కు యాపిల్ అందించిన కొత్త ఐఓఎస్ 26 అందిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ లిస్ట్ లో అందించిన ఫోన్స్ సంఖ్య కూడా ఇరవై ఆరే అవుతుంది.