Password Manager: మీ పాస్వర్డ్ ను వెంటనే చేంజ్ చేయండి.. లేకపోతే మీ అకౌంట్ అధోగతే.!
మీ పాస్వర్డ్ ను వెంటనే చేంజ్ చేయండి
అకౌంట్ అధోగతి పాలయ్యే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు
కోట్ల కొద్దీ యూజర్ అకౌంట్ పాస్వర్డ్ లు ఆన్లైన్లో లీకైనట్లు రిపోర్ట్స్
Password Manager: మీ పాస్వర్డ్ ను వెంటనే చేంజ్ చేయండి, లేకపోతే మీ అకౌంట్ అధోగతి పాలయ్యే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. రీసెంట్ గా ప్రపంచవ్యాప్తంగా లీకైన 16 బిలియన్ పాస్వర్డ్ లీక్ మరియు డేటా బ్రీచ్ న్యూస్ తో ఈ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కోట్ల కొద్దీ యూజర్ అకౌంట్ పాస్వర్డ్ లు ఆన్లైన్లో లీకైనట్లు రిపోర్ట్స్ సూచించాయి. ఈ సూచనతో యూజర్లు వారి పాస్వర్డ్ ను సెక్యూర్ చేసుకోవడానికి అన్ని అకౌంట్ పాస్వర్డ్ లను మార్చుకోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SurveyPassword Manager:
సైబర్ న్యూస్ రీసెర్చర్లు అరస్ నజరోవస్ మరియు బాబ్ డైచంకో ఈ కొత్త మరియు దారుణమైన డేటా బ్రీచ్ గురించి ముందుగా వెల్లడించారు. ఈ రీసెర్చర్ల ప్రకారం, గూగుల్, యాపిల్ మరియు ఫేస్ బుక్ వంటి అతి పెద్ద టెక్ దిగ్గజాలతో పాటు మరిన్ని సర్వీస్ ల ఓపెనింగ్ యాక్సెస్ ఈ డేటా బ్రీచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, చరిత్రలో అతిపెద్ద డేటా బ్రీచ్ కూడా ఇదే అవుతుంది. ఈ బ్రీచ్ తో యూజర్ అకౌంట్ పాస్వర్డ్ లు కూడా ఉన్నాయి కాబట్టి స్కామర్లు యూజర్ అకౌంట్స్ పై కన్నెసే అవకాశం ఉంటుంది.

ఇన్ఫో స్టీలర్ మాల్వేర్ ద్వారా స్కామర్లు ఈ డేటా బ్రీచ్ కు పాల్పడినట్లు చెబుతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మెకానిజం రెండంచల (టూ ఫ్యాక్టర్) ను కూడా చేధించినట్లు నిపుణులు చెబుతున్నారు. దారుణం ఏమిటంటే, 29 కంటే ఎక్కువ దేశాల్లో గవర్నమెంట్ మరియు ఎంటర్ప్రైజ్ సర్వీస్ సైట్స్ కూడా ఈ ఎఫెక్ట్ బాధితులలో ఉన్నాయి.
మెయిల్ అకౌంట్ బ్రీచ్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Have I Been Pwned లేదా Google Password Checkup ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, మీ పాస్వర్డ్ వీక్ ఉంటే కూడా ఇక్కడ వివరాలు తెలుస్తాయి. పాస్వర్డ్ వీక్ గా ఉంటే లేదా ఒకే పాస్వర్డ్ అన్ని అకౌంట్ లకు వ్లాకు ఉంటే కూడా వెంటనే మార్చుకోవడం మంచిది.
Also Read: Poco F7 5G: పోకో అప్ కమింగ్ ఫోన్ ఇంత తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందా.!
పాస్వర్డ్ ఎందుకు మార్చాలి?
డేటా మరియు పాస్వర్డ్ బ్రీచ్ చాలా రీసెంట్ గా జరిగింది కాబట్టి కొత్త పాస్వర్డ్ లను మార్చుకోవడం ద్వారా యూజర్ తన అకౌంట్ ను సురక్షితం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ చాలా కాలంగా ఉపయోగిస్తున్న లేదా మళ్ళీ మళ్ళీ ఉపయోగించే పాస్వర్డ్ కాకుండా కొత్త సెక్యూర్ పాస్వర్డ్ ను సెట్ చేసుకోవడం ఉత్తమం. అంతేకాదు, క్రిటికల్ సర్వీస్ లకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (MFA) ఎనేబుల్ చేసుకోండి.