Poco F7 5G: పోకో అప్ కమింగ్ ఫోన్ ఇంత తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందా.!

HIGHLIGHTS

పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియన్ మర్కెట్లో లాంచ్ అవుతుంది

అప్ కమింగ్ ఫోన్ తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది

Snapdragon 8 Gen 4 చిప్ సెట్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది

Poco F7 5G: పోకో అప్ కమింగ్ ఫోన్ ఇంత తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందా.!

Poco F7 5G: పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియన్ మర్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ ద్వారా లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ అంచనా ధర వివరాలు అందిస్తున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco F7 5G: ఫీచర్స్

ముందుగా పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ కలిగిన కీలక స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి తెలుసుకుంటే, ఈ అప్ కమింగ్ ఫోన్ ప్రైస్ గురించి ఒక అంచనా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన Snapdragon 8 Gen 4 చిప్ సెట్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఇది 21 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగిన 4nm TSMC చిప్ సెట్ మరియు AI సపోర్ట్ కలిగి ఉంటుంది.

Poco F7 smartphone with Snapdragon 8s Gen 4 chip to launch
Poco F7 smartphone with Snapdragon 8s Gen 4 chip to launch

ఈ ఫోన్ చిప్ సెట్ కి మరింత శక్తినిచ్చే 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ మరియు 24GB టర్బో ర్యామ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అంతేకాదు, ఇందులో వేగవంతమైన స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ ను కూడా ఈ ఫోన్ లో అందిస్తుంది. అంతేకాదు, సూపర్ గేమింగ్ కోసం వైల్డ్ బూస్ట్ 4.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో హై బ్రైట్నెస్ మరియు హై ఫ్రేమ్ రేట్ వద్ద ఈ ఫోన్ లో గేమింగ్ ను ఆఫర్ చేస్తుంది.

ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు సెంటర్ మెటల్ ఫ్రేమ్ తో అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Sony MIX882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 22.5 రివర్స్ ఛార్జ్ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7550 బిగ్ బ్యాటరీ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన డిస్ప్లే మరియు IP66 + IP68 + IP69 తో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ ఖఛ్చితంగా ప్రీమియం ఫోన్ అనిపించే రీతిలో ఉంటుంది.

Also Read: Samsung Galaxy S24 Ultra 5G పై అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Poco F7 5G: అంచనా ప్రైస్

పోకో అప్ అకమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 5జి ని రూ. 30,000 నుంచి రూ. 35,000 ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన స్మార్ట్ ఫోన్ కాంపిటీషన్ వలన ఈ ఫోన్ బేసిక్ ప్రైస్ 30 వేల రూపాయల చుట్టూనే ఉండే అవకాశం ఉందని కొందరు అంచనా చెబుతున్నారు. ఈ ఫోన్ జూన్ 24వ తేదీ లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ అఫీషియల్ ప్రైస్ కోసం మరో మూడు రోజులు ఎదురు చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo