AI సహాయంతో Independence Day 2025 ఇమేజెస్ మరియు విషెస్ సింపుల్ గా క్రియేట్ చేయండి.!
AI వచ్చిన తర్వాత చాలా క్లిష్టమైన క్రియేటివ్ పనులు కూడా చాలా సులభంగా మారిపోయాయి
క్రియేటివ్ ఇమేజెస్ మరియు విషెస్ కూడా మీరే సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు
ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ విషెస్ మరియు ఇమేజ్ లను మీరే క్రియేట్ చేసి పంపించండి
AI వచ్చిన తర్వాత చాలా క్లిష్టమైన మరియు కష్టమైన క్రియేటివ్ పనులు కూడా చాలా సులభంగా మారిపోయాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి మోదం మరియు మరికొందరికి ఖేదం సృష్టించింది. ఏది ఏమైనా ఎఐ వచ్చిన తర్వాత చాలా వరకు క్రియేటివిటి తో పని లేకుండా పోయింది. ఎఐ తో చాలా సింపుల్ గా క్రియేటివ్ ఇమేజెస్ మరియు విషెస్ కూడా మీరే సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు AI సహాయంతో Independence Day 2025 ఇమేజెస్ మరియు విషెస్ సింపుల్ గా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ విషెస్ మరియు ఇమేజ్ లను మీరే క్రియేట్ చేసి పంపించండి.
SurveyIndependence Day 2025 : AI ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి?
ఇండిపెండెన్స్ డే 2025 కోసం మీరు ఎఐ ఇమేజస్ క్రియేట్ చేయడానికి చాలా ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. చాట్ జిపిటి, జెమిని ఎఐ, Grok వంటి ఎఐ ప్లాట్ ఫామ్స్ పై సింపుల్ ప్రాంప్ట్ తో ఇమేజస్ ఇన్స్టాంట్ గా అందుకోవచ్చు. దీనికోసం ‘క్రియేట్ ఇండిపెండెన్స్ డే 2025 ఇమేజస్’ అని అడిగితే చాలు, కొత్త ఇమేజెస్ లను క్షణంలో అందిస్తుంది. దీనికోసం మీకు ఎటువంటి ఇమేజ్ ఎడిటింగ్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు.
అయితే, ఇది కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఇమేజ్ ఎడిటింగ్ మరియు క్రియేట్ ప్లాట్ ఫామ్స్ తో మరింత అర్ధవంతమైన ఇమేజ్ లను మీరు క్రియేట్ చేయవచ్చు. ఇందులో Canva, Fotor, Bing ఇమేజ్ క్రియేటర్ మరియు నైట్ కేఫ్ వంటి ఉచిత ఇమేజ్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మరింత ఉన్నతమైన ఇమేజెస్ కోరుకుంటే, Mid Journey, DALL·E, Leonardo AI మరియు Firefly వంటి ప్రీమియం ప్లాట్ ఫామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇమేజ్ క్రియేట్ చేయడానికి ముందుగా ఈ ప్లాట్ ఫామ్స్ ఏపీని చేసి ఇమేజ్ క్రియేషన్ సెక్షన్ ఎంచుకోవాలి మరియు ఇక్కడ AI ట్యాబ్ ఎంచుకొని ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇందులో మీరు కోరుకునే ఇమేజ్ గురించి కొంచెం క్లుప్తంగా ప్రాంప్ట్ ఇస్తే చాలు గుట్టల కొద్దీ ఇమేజెస్ క్రియేట్ చేసి ఈ ప్లాట్ ఫామ్స్ అందిస్తాయి. మీరు ఈ ఇమేజ్ లను మీకు ఇష్టప్రకారం సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Independence Day 2025: తెలుగులో విషెస్ మరియు క్రియేటివ్ ఇమేజెస్ ప్రత్యేకంగా మీకోసం.!
Independence Day 2025 : కొటేషన్స్ లేదా విషెస్ ఎలా పొందాలి?
దీనికోసం, చాట్ జిపిటి, జెమిని ఎఐ, Grok మరియు పర్ప్లెక్సిటీ ప్లేటు ఫామ్స్ చాలా వేగంగా మీకు విషెస్ మరియు కొటేషన్స్ అందిస్తాయి. దీనికోసం ఇండియా ఇండిపెండెన్స్ డే 2025 విషెస్ లేదా కొటేషన్స్ అని అడిగితే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని విషెస్ అందిస్తుంది.
ఇవి కాకుండా వాట్సప్ కలిగిన Meta AI సపోర్ట్ తో ఇమేజ్, కొటేషన్ మరియు విషెస్ ను వాట్సాప్ లోనే నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు మరియు వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేయవచ్చు.