Great Freedom Festival Sale అనౌన్స్ చేసిన అమెజాన్ ఇండియా.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు Great Freedom Festival Sale డేట్ అనౌన్స్ చేసింది

ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఈ సేల్ ను అనౌన్స్ చేసింది

ఈసారి రెట్టించిన డీల్స్ మరియు ఆఫర్లు అందించే అవకాశం ఉందని చెబుతోంది

Great Freedom Festival Sale అనౌన్స్ చేసిన అమెజాన్ ఇండియా.!

ప్రముఖ ఇకార్ట్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ఇండియా ఈరోజు Great Freedom Festival Sale డేట్ అనౌన్స్ చేసింది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సేల్ ను ప్రతీ సంవత్సరం తీసుకు వస్తుంది మరియు ఈ సేల్ ఆగస్టు నెల ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఈ సేల్ ను అనౌన్స్ చేసింది. అయితే, ఈసారి రెట్టించిన డీల్స్ మరియు ఆఫర్లు అందించే అవకాశం ఉందని చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Great Freedom Festival Sale ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ సైట్ నుంచి ఈ సేల్ ప్రతి ఒక్కరికి మొదలవుతుంది. అయితే, 12 గంటల ముందే ప్రైమ్ సభ్యుల కోసం ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. అంటే, 31వ తేదీ (అర్ధరాత్రి) 12 AM గంటలకు ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు లైవ్ అవుతుంది. ప్రైమ్ సభ్యులు 12 గంటల ముందు ఈ సేల్ ఆఫర్లు అందుకుంటారు.

Great Freedom Festival Sale బ్యాంక్ పార్టనర్ ఎవరు?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కోసం SBI Card ను బ్యాంక్ పార్ట్నర్ గా ప్రకటించింది. కాబట్టి, SBI క్రెడిట్ కార్డు మరియు EMI ఆఫర్ తో ఈ అమెజాన్ సేల్ నుంచి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Moto G86 Power 5G: లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!

ఈ సేల్ నుంచి అమెజాన్ ఎటువంటి డీల్స్ అందిస్తుంది?

అమెజాన్ ఇండియా ఈ సేల్ నుంచి రెగ్యులర్ డిస్కౌంట్ ఆఫర్లు, ట్రేండింగ్ డీల్స్, 8pm డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్ మరియు ఎక్స్ చేంజ్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, సౌండ్ బార్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్స్ మరియు స్మార్ట్ వాచ్ వంటి మరిన్ని ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Amazon Great Freedom Festival Sale

అమెజాన్ ఇప్పటికే ఒక ప్రీమియం ఫోన్ ఆఫర్ గురించి టీజింగ్ చేస్తోంది. అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి అందుకోండి అని అమెజాన్ టీజింగ్ మొదలు పెట్టింది. ఇది కాకుండా Sony, జెబ్రోనిక్స్, JBL, LG మరియు మరిన్ని సౌండ్ బార్స్ పై గొప్ప డిస్కౌంట్ అందుకోండి అని కొద అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo