Pushpa 2 OTT రిలీజ్ డేట్ మరియు కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
Pushpa 2 OTT రిలీజ్ డేట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది
ఈ సినిమా OTT గురించి ఇప్పుడు కొత్త న్యూస్ బయటకు వచ్చింది
పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది
Pushpa 2 OTT రిలీజ్ డేట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్, రష్మిక మందన సూపర్ హిట్ మూవీ పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ లను వసూలు చేసింది. అంతేకాదు, ఈ సినిమా నార్త్ బెల్ట్ లో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతున్నట్లు చెబుతున్నారు. Sacnilk రిపోర్ట్ ప్రకారం, పుష్ప 2 ఇప్పటి వరకు ఇండియాలో 645 కోట్ల కలెక్షన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా నిన్నటి వరకు వరల్డ్ వైడ్ 922 కోట్ల గ్రాస్ కలెక్షన్ హిట్ చేసినట్టు సినిమా యాజమాన్యం ప్రకటించింది. ఈ సినిమా OTT గురించి ఇప్పుడు కొత్త న్యూస్ బయటకు వచ్చింది.
SurveyPushpa 2 OTT లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
పుష్ప 2 సినిమా OTT రైట్స్ ను భారీ మొత్తం చెల్లించి Netflix సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ కోసం నెట్ ఫ్లిక్స్ టీజింగ్ మొదలు పెట్టింది. పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ కొత్త పోస్టర్ తో టీజింగ్ చేస్తోంది. Pushpa 2 : The Rule తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, పుష్ప 2 సినిమా OTT రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

పుష్ప 2 సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను చూస్తున్న నేపథ్యంలో సినిమా ఒటిటి డేట్ రావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టవచ్చని సినిమా వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. అంతేకాదు, పుష్ప 1 మరియు పుష్ప 2 రెండు పార్ట్ లు కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తాయని ఒక రిపోర్ట్ చెబుతోంది. అయితే, ఈ విషయం పై నెట్ ఫ్లిక్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు.
Also Read: Lava O3 Pro: బడ్జెట్ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్స్ కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!
కలెక్షన్స్ పరంగా పుష్ప 2 హిందీ బెల్ట్ లో అధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ మూవీగా రికార్డుల లిస్ట్ లో చేరిపోయింది.